17.1 C
India
Sunday, December 7, 2025
More

    World Cup Qualifiers : వెస్టిండీస్ పై విజయవాడ కుర్రాడి దూకుడు.. వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ లో సంచలనం

    Date:

    World Cup Qualifiers
    World Cup Qualifiers, Teja Nedamanuru

    World Cup Qualifiers : ఐసీసీ వరల్డ్ కప్..క్వాలిఫయర్స్‌ మ్యాచ్ లు ప్రస్తుతం జరుగుతున్నాయి. ఇప్పటికే పలు జట్లు సూపర్ సిక్స్ చేరుకున్నాయి. కానీ సోమవారం జరిగిన వెస్టిండీస్, నెదర్లాండ్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠను రేపింది. ముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 374 పరుగులు చేసింది. ఇక వెస్టీండీస్ గెలుపు ఖాయమనుకున్న దశలో నెదర్లాండ్స్ దీనిని సమం చేసింది. అనంతరం సూపర్ ఓవర్‌లో నెదర్లాండ్స్ విజేతగా నిలిచింది. జింబాబ్వే రాజధాని హరారే స్పోర్స్ట్ క్లబ్ స్టేడియంలో జరిగిన క్వాలిఫయర్ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ వెస్టిండీస్ ను ఆటాడుకుంది. వెస్టిండీస్ నిర్దేశించిన 374 పరుగులను సమం చేసి, సూపర్ ఓవర్‌లో ఏకంగా 30 రన్స్ రాబట్టింది. ఈ లక్ష్యాన్ని అందుకోవడం లో వెస్టిండీస్ విఫలమైంది. కేవలం ఎనిమిది పరుగులే చేసింది.

    అయితే ముందుగా బ్యాటింగ్ కు దిగిన వెస్టిండీస్ 50 ఓవర్లల్లో ఆరు వికెట్ల నష్టానికి 374 పరుగులు చేసింది. వికెట్ కీపర్ నికొలస్ పూరన్ శతకంతో ఆకట్టుకున్నాడు. 65 బంతుల్లో 6 సిక్స్ లు, 9 ఫోర్లతో 104 పరుగులు చేశాడు. ఇక మిగతా ఆటగాళ్లు బ్రెండన్ కింగ్ 76, జాన్సన్ ఛార్లెస్ 54, షమారా బ్రూక్స్ 25, షై హోప్- 47, ఆఖర్లో కీమో పాల్ 46తో స్టేడియంలో పరుగుల వరద పారింది. అయితే భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ ఏ మాత్రం తగ్గలేదు. తొలి ఓవర్ నుంచే అటాక్ స్టార్ట్ చేసింది. విక్రమ్‌జీత్ సింగ్ 37, మ్యాక్స్ ఓడౌడ్ 36, వెస్లీ బర్రెసీ 27, బాస్ డీ లెడె 33 పరుగులు చేశారు. కెప్టెన్ స్కాట్ ఎడ్వర్డ్స్ 47 బంతుల్లో 67 పరుగులు చేశాడు. ఆటగాళ్లంతో అటాక్ మోడ్ లో పోరాటం చేశారు. దీంతో నెదర్లాండ్స్ కూడా 50 ఓవర్లల్లో సరిగ్గా 374 రన్స్ చేసింది.

    ఈ మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు బ్యాట్స్ మెన్ తేజ నిడమానూరు సెంచరీతో కదం తొక్కాడు. 76 బంతుల్లో 3 సిక్స్ లు, 11 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. వెస్టిండీస్ బౌలర్ల ను ఊచకోత కోశాడు. తేజ బ్యాటింగ్ ధాటికి విండీస్ బౌలర్లకు చుక్కలు కనిపించాయి. అంతర్జాతీయ మ్యాచ్ లను ఆడిన అనుభవం తక్కువే అయినప్పటికీ ప్రొఫెషనల్ ఆటతీరును కనపర్చాడు.  అనిల్ తేజ నిడమానూరు స్వస్థలం ఏపీలోని విజయవాడ. 1994 ఆగస్టు 22న ఆయన పుట్టాడు. అనంతరం అనిల్ తేజ కుటుంబం నెదర్లాండ్స్‌లో స్థిరపడింది. అక్కడే తన క్రికెట్ ప్రస్థానాన్ని మొదలు పెట్టాడు. నెదర్లాండ్స్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు ఆల్ రౌండర్ గా గుర్తింపు సాధించాడు. గతంలో అక్లాండ్, అక్లాండ్ ఏ జట్ల తరఫున కూడా అనిల్ తేజ ఆడాడు. రైట్ హ్యాండ్ బ్యాటర్. రైట్ హ్యాండ్ ఆఫ్ బ్రేక్ బౌలర్ కూడా. 16 వన్డే, ఆరు టీ20 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడిన అనుభవం అనిల్ తేజకు ఉంది. వన్డేల్లో ఇది రెండో సెంచరీ. జింబాబ్వేపై తొలి సెంచరీ నమోదు చేశాడు. ఇప్పుడు విండీస్ పై తేజ సెంచరీ.. నెదర్లాండ్స్ గెలుపునకు కారణమైంది.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related