CP Kanti Rana Tata :
ప్రభుత్వ పెద్దల మెప్పుకోసం చేయకూడని పనులు చేసి, ఒక్కోసారి అడ్డంగా దొరికిపోతుంటారు కొందరు పోలీసులు. అనుకూలంగా పనిచేస్తున్నామనో, మెప్పుకోసమో, ప్రమోషన్లు , బదిలీల కోసమో తెలియదు కాని ఇలాంటి వారి వల్ల పోలీస్ శాఖకే చెడ్డ పేరు వస్తుంటుంది. అయితే ఇక్కడ ఏం జరిగిందో తెలియదు కాని.. అలాంటి ఇష్యూ ఒకటి బయటకు వచ్చింది.
ఏపీలో విజయవాడ సీపీ కాంతి రాణా టాటా. సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్. అయితే ఒక కేసు విషయంలో ఇప్పుడు ఆయన చర్చనీయాంశమయ్యారు. ఏదో పెద్ద కేసును ఛేధించినట్లుగా ఆయన స్వయంగా ప్రెస్ మీట్ పెట్టారు. చివరకు కోర్టు మాత్రం సదరు వ్యక్తికి రిమాండ్ విధించేందుకు తిరస్కరించింది. విషయం ఏంటంటే.. మార్గదర్శిలో చిట్ వేశానని, అయితే చిట్టీ పాడుకున్నా తనకు డబ్బులు ఇవ్వలేదని ఓ వ్యక్తి ఫిర్యాదు చేశాడు. ఇంకేం అసలే ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు మార్గదర్శి పేరు ఎత్తితేనే మండిపడుతున్నారు. దొరికింది చాన్స్ అంటూ పోలీసులు రంగంలోకి దిగారు. సదరు ఏజెంట్లు, మేనేజర్ ను అరెస్ట్ చేశారు. ఒక రోజంతా స్టేషన్ లో ఉంచి చివరకు కోర్టులో ప్రవేశ పెట్టారు. అయితే చిటీ ఎత్తుకున్న విషయం కరెక్ట్ అని, కానీ ష్యూరిటీలు ఇవ్వకపోవడంతో తాము ఇవ్వలేదని వారు చెప్పుకొచ్చారు. ఇది పోలీసులకు చెప్పినా పట్టించుకోకుండా మమ్మల్ని అరెస్ట్ చేశారని వారు కోర్టు దృష్టికి తెచ్చారు. ఇది విన్న కోర్టు వారికి రిమాండ్ విధించేందుకు నిరకారించింది.
ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. పనికిరాని కేసును పట్టుకొని సీపీ అతి చేశారంటూ అంతా చర్చించుకుంటున్నారు. రాజకీయ పార్టీల కు సపోర్టుగా నేటి పోలీస్ వ్యవస్థ తయారైందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి ఘటనలు ప్రజల్లో మరింత చులనకయ్యేలా చేస్తాయి. మార్గదర్శి పేరు చెప్పగానే సదరు పోలీస్ అధికారి వ్యవహరించిన తీరు, ఆకేసులో ఏముందో తెలుసుకోకుండా చూపించిన అతి చూసి అంతా నవ్వకునేలా చేసింది. ఏదేమైనా కాంతి రాణా టాటా లాంటి మంచి పోలీస్ ఆఫీసర్ కూడా ఇలా ప్రవర్తించడం సర్కారు ఒత్తిడి వల్లే అని మరికొందరు మాట్లాడుకుంటున్నారు.