
కలశ స్థాపన పూజతో ఆలయంలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. నవరాత్రుల మొదటి రోజు పాడ్యమి నాడు, దుర్గాదేవిని శ్రీ స్వర్ణకవచ అలంకృత దుర్గగా అలంకరిస్తారు. ముగింపు రోజు, విజయ దశమి, శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారిని పూజిస్తారు.
అక్టోబర్ 3వ తేదీన ఉదయం 8 గంటలకు స్నపనం అనంతరం అమ్మవారి ఆలయాన్ని తెరుస్తారు. మిగిలిన రోజుల్లో, ఆలయం ఉదయం 3 నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంటుంది. మూలా నక్షత్రం రోజున, ఆలయం తెల్లవారు జామున 2 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దర్శనం కోసం తెరిచి ఉంటుంది.
మూలా నక్షత్ర సరస్వతీ పూజ రోజున నాలుగు విడతలుగా ప్రత్యేక కుంకుమార్చన నిర్వహిస్తారు. సమయాలు చూసుకుంటే ఉదయం 7 నుంచి 9 వరకు, 10 నుంచి మధ్యాహ్నం 12 వరకు, మధ్యాహ్నం 1 నుంచి 3 వరకు, సాయంత్రం 4 నుంచి సాయంత్రం 6 వరకు. ఒక్కో బ్యాచ్‌కు 200 టిక్కెట్లు మాత్రమే జారీ చేస్తారు.
1వ రోజు – గురువారం, 3 అక్టోబర్, 2024 – శ్రీ బాలాత్రిపుర సుందరి దేవిగా అమ్మవారిని కొలుస్తారు. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి – లేత గులాబీ రంగు చీర.
2వ రోజు – శుక్రవారం, 4 అక్టోబర్, 2024 – శ్రీ గాయత్రీ దేవి గా – ఆశ్వయుజ శుద్ధ విదియ – నారింజ కలర్ చీర.
3వ రోజు – శనివారం, 5 అక్టోబర్, 2024 – శ్రీ అన్నపూర్ణా దేవి గా – ఆశ్వయుజ శుద్ధ తదియ – పసుపు చందనం రంగు చీర.
4వ రోజు – ఆదివారం, 6 అక్టోబర్, 2024 – శ్రీ లలితా త్రిపుర సుందరి దేవి – ఆశ్వయుజ శుద్ధ చవితి – స్వచ్ఛమైన బంగారు రంగు చీర.
5వ రోజు – సోమవారం, 7 అక్టోబర్, 2024 – శ్రీ మహా చండీ దేవి అలంకారం – ఆశ్వయుజ శుద్ధ పంచమి
6వ రోజు – మంగళవారం, 8 అక్టోబర్, 2024 – శ్రీ మహాలక్ష్మీ దేవి గా – ఆశ్వయుజ శుద్ధ షష్టి – గులాబీ కలర్ చీర.
7వ రోజు – బుధవారం, 9 అక్టోబర్, 2024 – శ్రీ సరస్వతీ దేవి – ఆశ్వయుజ శుద్ధ సప్తమి – తెలుపు రంగు చీర.
8వ రోజు – గురువారం, 10 అక్టోబర్, 2024 – శ్రీ దుర్గా దేవి అలంకారం – ఆశ్వయుజ శుద్ధ అష్టమి – ఎరుపు రంగు చీర.
9వ రోజు – శుక్రవారం, 11 అక్టోబర్, 2024 – శ్రీ మహిషాసురమర్ధినీ దేవి – ఆశ్వయుజ శుద్ధ నవమి (మహానవమి) – బ్రౌన్ లేదా రెడ్ కలర్ హ్యాండ్ లూమ్ చీర.
10వ రోజు – శనివారం, 12 అక్టోబర్ 2024 – శ్రీ రాజరాజేశ్వరి దేవి – ఆశ్వయుజ శుద్ధ దశమి (విజయదశమి) – ఆకుపచ్చ రంగు చీరతో తల్లిని అలంకరిస్తారు.