
Villages empty : ఏపీలో కొందరు లీడర్లు వస్తున్నారంటే జనాలు భయపడుతున్నారు. మరోవైపు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా లీడర్లు ఊర్ల బాట పడుతున్నారు. అయితే ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి దారుణంగా ఉంది. పలు నియోజకవర్గాల్లో వారికి అడుగడుగునా నిరసన వ్యక్తమవుతున్నది. గెలిచిన నాలుగేళ్లకు మళ్లీ ఊర్లకు వస్తున్నారా అంటూ మండిపడుతున్నారు. చేసిన మంచి పనులు ఏంటో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు.
అటు ఏపీ సీఎం బటన్ నొక్కి పథకాలు విడుదల చేస్తున్నారు. ఇంటింటికీ సంక్షేమం చేరుతున్నదని ఆయన నమ్మకంతో ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్యేలను క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రభుత్వం చేసిన మంచిని వివరించాలని ఆదేశిస్తున్నారు. దీంతో పాటు ఐ ప్యాక్ టీమ్ తో పాటు నిఘా వర్గాలను వీరి పర్యటన వివరాలను తెప్పించుకుంటున్నారు. దీంతో ఎమ్మెల్యేలు గ్రామాల్లోకి వెళ్లక పరిస్థితి నెలకొంది.
అయితే చిత్తూరు జిల్లాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. అయితే ఇక్కడ ఓ గ్రామంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామికి చేదు అనుభవం ఎదురైంది. ఆయన తమ గ్రామంలోకి రాగా, ఓ కాలనీ వాసులు పూర్తిగా ఆయన కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇళ్లకు తాళాలు వేసి మరి ఎటో వెళ్లిపోయారు. మరో వైపు ప్రభుత్వ పథకాలు పొందుతూనే తాను వస్తే తాళాలు వేసుకుంటారా అంటూ నారాయణ స్వామి అగ్రహం వ్యక్తం చేశారు. అదే జిల్లాలోలని పూతల పట్టు ఎమ్మెల్యే బాబు కు కూడా విచిత్ర పరిస్థితి ఎదురైంది. పేట అగ్రహారరం దళిత వాడకు ఆయన వెళ్లగా స్థానికులు బహిష్కరించారు. ఇళ్లకు తాళాలు వేసుకొని వెళ్లిపోయారు. దీంతో వారిపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఆ తర్వాత బాబు వెళ్లిపోగానే. గ్రామస్తులంతా కాలనీ వీధులను పసుపు నీటితో శుభ్రంచేశారు. ఈ ఘటనలకు సంబంధించిన రెండు వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గడపగడకూ సంక్షేమం కార్యక్రమం ఇలా ఎమ్మెల్యేలు అవమానాలకు గురవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా గ్రామల్లోకి వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలకు ఇలా చుక్కెదరవడం టీడీపీ శ్రేణులను ఆనందంలో ముంచుతున్నది. సమస్యలపై అటు ప్రజల్లో చైతన్యం వచ్చిందని, ఇన్నాళ్లు వైసీపీ పాలనలో ఎదురైన బాధలు వారిలో కనిపిస్తున్నాయని అంతా అనుకుంటున్నారు.