Vinayaka Chavithi Story : భాద్రపద మాసంలో వచ్చే చతుర్థి రోజు వినాయక చవితి జరుపుకుంటాం. దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగలో భాగంగా దేవుడిని కొలుస్తుంటాం. కానీ ఈ కథ ఎందుకొచ్చింది? దాని పరమార్థం ఏమిటనే వాదనలు అందరిలో వస్తుంటాయి. వినాయకుడి పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకుంటే మనకు ఎన్నో విషయాలు తెలుస్తాయి.
ఓ రోజు పార్వతి స్నానం చేస్తుండగా శివుడు లోపలకు వస్తాడు. ఎవరిని లోపలకు రానివ్వొద్దంటూ ఓ పిండిముద్దకు ప్రాణం పోసి గేటు వద్ద కాపలా ఉంచుతుంది. దీంతో అతడు శివుడిని అడ్డుకుంటాడు. నా ఇంట్లోకి నన్నే వెళ్లనివ్వవా అని ఆ బాలుడి తల ఖండిస్తాడు శివుడు. అప్పుడు పార్వతి బయటకు వచ్చి జరిగిన విషయం తెలుసుకుని అతడిని బతికించాలని లేకపోతే నేను కూడా బతకనని చెబుతుంది.
అప్పుడు శివుడు దక్షిణం వైపు తల పెట్టుకుని పడుకున్న జంతువైనా మనిషైనా తల తీసుకుని రావాలని సేవకకులకు సెలవిస్తాడు. దీంతో వారు అడవిలో వెతుకుతుండగా ఓ ఏనుగు దక్షిణం వైపు తల పెట్టుకుని ఉండటంతో దాని తల తీసుకుని వెళతారు. ఏనుగు తల వినాయకుడికి అమర్చుతారు. దీంతో అతడి ప్రాణం తిరిగి వస్తుంది. ఇది విఘ్నేశ్వరుడి జన్మకు కారణం.
చవితి రోజు వినాయకుడు తన వాహనమైన ఎలుక మీద పొలంలో తిరుగుతుండగా జారి పొలంలో పడతాడు. ఆ సమయంలో ఆకాశంలో నుంచి చంద్రుడు చూసి నవ్వుతాడు. దానికి వినాయకుడు నొచ్చుకుని తనను అపహాస్యం చేసినందుకు చవితి రోజు నిన్ను చూస్తే నీలాప నిందలు వస్తాయని శపిస్తాడు. అందుకే చవితి రోజు ఎవరు కూడా చందమామను చూడరు.