Viral Video : నిత్యం ఎక్కడో ఓ చోట దొంగతనాలు జరిగిన వార్తలు వింటూనే ఉంటాము. దొంగలు కూడా కొత్త కొత్త టెక్నిక్స్ ఉపయోగించి దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఆడ మగ అనే తేడా లేకుండా జనాలను నిలువు దోపిడీ చేస్తున్నారు. దారిన పోయే వారిని నైస్ గా నమ్మించి మోసం చేస్తున్నారు. తొలుత అనుమానం కలుగకుండా నమ్మిస్తుంటారు. చివరకు తమ అసలు స్వరూపం బయటపెడుతున్నారు. మరికొందరు మహిళలు ఏవేవో మాటలు చెప్పి నమ్మించి మోసం చేస్తుండడం చూస్తుంటాం.
ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు, వీడియోలు.. సోషల్ మీడియాలో ఇటీవల తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. వీడియోలో ఓ వ్యక్తి మహిళకు లిఫ్ట్ ఇచ్చి బైకులో ఎక్కించుకెళ్లడం చూసి కొందరు యువకులు కారులో ఛేజ్ చేసి మరీ వారిని ఆపేశారు. చివరకు వారు చెప్పింది విని ఆ బైకర్ అవాక్కయ్యాడు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి బైకు పై వెళ్తుండగా రోడ్డు పక్కన నిలబడ్డ ఓ మహిళ చేయి ఎత్తి ఆపుతుంది. బైకు ఆపగానే తాను అర్జంట్‌గా వెళ్లాలని, లిఫ్ట్ ఇవ్వాలని కోరింది. ఆ వ్యక్తి పాపం అని సదరు మహిళను బైకు ఎక్కించుకుని వెళ్లాడు. అయితే ఆమెను మొదటి నుంచీ గమనించిన కొందరు యువకులకు అనుమానం కలిగింది. దీంతో వెంటనే కారులో వెళ్లి బైకర్‌ను ఆపారు. ‘‘బైకు పక్కన ఆపండి’’.. అని గట్టిగా అరుస్తూ చెప్పారు. దీంతో సదరు వ్యక్తి బైకును రోడ్డు పక్కన ఆపాడు.
కారు దిగి అక్కడికి వెళ్లిన యువకులు.. ‘‘నువ్వు లిఫ్ట్ ఇచ్చిన మహిళ ఓ దోపిడీ ముఠా సభ్యురాలు.. లిఫ్ట్ పేరుతో నిన్ను ఎవరూ లేని చోటుకు తీసుకెళ్లి దోచుకుంటారు. మిగతా ముఠా సభ్యులు వెనుక వస్తున్నారు.. వెంటనే ఇక్కడి నుంచి పారిపో’’.. అని చెబుతారు. దీంతో ఆ వ్యక్తి భయంతో అక్కడి నుంచి వెళ్లిపోతాడు. యువకులు అసలు విషయం చెప్పడంతో సదరు మహిళ షాక్ అవుతుంది. తానేమీ తప్పు చేయలేదు.. అన్నట్లుగా నటిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.
Lift-Scam Kalesh Exposed by a Good guy (Context in the Clip)
pic.twitter.com/6h4Myq2IBg— Ghar Ke Kalesh (@gharkekalesh) September 9, 2024