Viral Video : డబ్బుకు లోకం దాసోహం అన్న నానుడి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. డబ్బులుంటే కొండమీద కోతినైనా తీసుకుని రావచ్చు. కానీ అన్నింటికీ డబ్బే పరిష్కారం కాదు. ఇటీవల ముకేశ్ అంబానీ తన చిన్న కొడుకుకు పెళ్లి వేల కోట్లు ఖర్చు పెట్టి చేశాడు. ప్రపంచంలోని వీవీఐపీలందరినీ పెళ్లికి ఆహ్వానించి కోట్లు విలువ చేసే గిఫ్టులు ఇచ్చాడు.
ఇదే సమయంలో కొందరు అనంత్ అంబానీ భారీ కాయాన్ని చూసి గేలి చేశారు. “అంబానీ ఎన్ని వేల కోట్లు పెట్టి వేడుక చేస్తే ఏంటి.. అనంత్ స్థూలకాయత్వాన్ని తగ్గించలేదు కదా? ” అంటూ విమర్శించారు. నిజమే అంబానీ దగ్గర లక్షల కోట్ల సంపద ఉంది. కానీ తన కొడుకుకు ఉన్న లోపాన్ని సరిచేయలేకపోయాడు.. డబ్బుంటే అన్ని వస్తాయనుకుంటాం గానీ.. డబ్బులతో కూడా కొనలేనివి చాలా ఉంటాయి. అయితే సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో డబ్బుతో సంతోషం కచ్చితంగా కొనొచ్చని నిరూపిస్తోంది.
ఇన్ స్టా గ్రామ్ లో ట్రెండ్ అవుతున్న వీడియో ప్రకారం.. ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న సముద్ర జలాలపై ఒక షిప్ వేగంగా పరుగులు తీస్తోంది. ఆ నౌక వేగం తాలూకూ నీటి అలలు సరికొత్త అనుభూతిని కలిగిస్తున్నాయి. ఇదే సమయంలో కొంతమంది యువతులు హాయిగా పడుకున్నారు. నెత్తి కింద దిండు పెట్టుకొని.. సముద్ర జలాల హోరును తమ చెవులారా వింటూ ప్రయాణాన్ని ఆస్వాదిస్తున్నారు. అప్పటికి ఇంకా పూర్తిగా తెలవారలేదు. మగత నిద్రలో.. కలలు కంటూ.. నీటిపై అత్యంత వేగంగా ప్రయాణిస్తూ జీవితానికి సరిపడిన అనుభూతిని వారు సొంతం చేసుకుంటున్నారు.
ఈ వీడియోకు ఇప్పటికే లక్షల సంఖ్యలో వ్యూస్ వచ్చాయి. వేలాదిమంది ఈ వీడియో పై తమ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. ఓ నెటిజన్ ”జీవితం చాలా చిన్నది. ఎప్పుడు ఏమవుతుందో మనకే తెలియదు. ఈ క్షణం గ్యారంటీ అని చెప్పలేం. కానీ ఆ జీవితాన్ని కొంతమంది అద్భుతంగా జీవిస్తారు. సరికొత్త అనుభూతులను సొంతం చేసుకుంటారు.” అంటూ కామెంట్ చేశారు. అందుకే డబ్బుతో కొనలేనివి చాలానే ఉన్నా..డబ్బుంటే జీవితంలోని మాధుర్యాన్ని మరింత అనుభవించవచ్చని చెప్పవచ్చు.
View this post on Instagram