
Viral Video : వివాహాది క్రతువులో వధూవరులు, బంధువులు సరదాగా ఆటపట్టించుకోవడం సహజమే. కానీ, అందులో ఎవరైనా సీరియస్ అయితే వినోదం కాస్తా విషాదంగా మారుతుంది. ఇలా వివాహాలు రద్దయిన ఘటనలు, వివాహం జరిగిన తర్వాతి రోజు వరుడు, వధువు దూరమైన ఘటనలు చాలానే జరిగాయి.
ఇక, కొన్ని ప్రాంతాల్లో పెళ్లి ఒక ఎత్తయితే, భోజనాలు వడ్డన మరో ఎత్తు.. భోజనాల వద్ద గొడవ జరిగిందా ఒక్కో సారి అది తీవ్రంగా జరిగి పోలీస్ స్టేషన్లలో కేసుల వరకు వెళ్లవచ్చు. శుభకార్యాలు కూడా రద్దయ్యే వరకు దారి తీస్తుంది. ఇలాంటి గొడవలు వివాహాది వేడుకల్లో జరిగితే ఎక్కువగా నష్టపోయేది వధువు, వరుడు మాత్రమే. ఎందుకంటే ఈ వివాహం రద్దయితే వారు రెండో వధువు, రెండో వరుడిగా మారుతారు. కారణం ఏదైనా సరే ఒక సారి వివాహం రద్దయితే ‘రెండో’ అనే ముద్ర పడిపోతుంది.
ఇక్కడ ఒక వీడియో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఒక రిసెప్షన్ వేడుకలో వధువు తొలుత వరుడి మెడలో దండ వేసింది. అందుకు వరుడు ముందుకు తల వంచి అంగీకరిస్తాడు. తర్వాత వరుడు దండ వేస్తుండగా పలుమార్లు వెనక్కి జరిగి వరుడిని ఆటపట్టించింది వధువు. దీంతో కోపోద్రేక్తుడైన వరుడు వధువును కిందకు తోసేసి చేతిలోని, తన మెడలోని దండను నేల కేసి కొట్టి అసహనంతో వెళ్లిపోతాడు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోను చూసిన నెటిజన్లు భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు. లైక్స్ కోసం ఇలా చేశారని కొందరంటుండగా, నిజంగా జరిగిందని మరికొందరంటున్నారు. కానీ ఇది ఎక్కడ జరిగిందన్నది మాత్రం తెలియరాలేదు.