Viral Video : మనలో చాలా మంది జంతువులను పెంచుకుంటారు. కొందరు ఆవులు, మేకలు, కుక్కలు, పిల్లులను పెంచుకుంటుంటారు. వాటిని అల్లారుముద్దుగా చూసుకుంటారు. రోజు అన్నం పెడుతూ మచ్చిక చేసుకుంటారు. జంతువులను ప్రేమించే ఓ జంతు ప్రేమికురాలు ఓ పిల్లి కూనను చేరదీసింది. రష్యన్ మహిళ అయిన ఆమెకు జంతువులంటే సరదా. అందుకే వాటిని దగ్గరకు తీసుకుని ప్రేమగా చూసుకుంటుంది.
రష్యాకు చెందిన మహిళ రోడ్డు వెంట వెళ్తున్న క్రమంలో చెట్ల పొదల్లో కనిపించిన ఓ పిల్లి కూన కంట పడింది. దీంతో దాన్ని వెంట తీసుకొచ్చి సాకడం మొదలు పెట్టింది. ఇంట్లో ఉన్న కుక్కతో పాటు దాన్ని పెంచుతూ వస్తోంది. కానీ అది పిల్లి కాదు బ్లాక్ పాంథర్ (నల్ల చిరుత)గా గుర్తించారు. కానీ అది పిల్లిలాగే కుక్కతోపాటు పెరుగుతోంది.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. బ్లాక్ పాంథర్ దొరికిన స్థితి నుంచి అది ఎదిగే క్రమంలో పలు వీడియోలు ఇన్ స్టా గ్రామ్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో ఆ వీడియోలకు లైకులు వస్తున్నాయి. మిలియన్లలో వ్యూస్ వస్తున్నాయి. బ్లాక్ పాంథర్ రూపురేఖలు మారుతుండటంతో దాన్ని చూసి భయపడుతున్నారు. కానీ అది మాత్రం పిల్లిలాగే ప్రవర్తిస్తోంది.
ప్రస్తుతం ఈ వీడియోను 35 లక్షల మంది వీక్షించారు. జంతువులను ప్రేమించే మహిళ సాహసాన్ని ప్రశంసిస్తున్నారు. నల్ల చిరుతను పెంచుతూ దాన్ని మచ్చిక చేసుకునే విధానం బాగుందంటున్నారు. జంతు సంరక్షణ మన అందరి బాధ్యతగా గుర్తించాలి. జంతువులు అంతరిస్తున్న నేపథ్యంలో ఆమె నల్ల చిరుతను పెంచడం బాగుందని కితాబిస్తున్నారు.
View this post on Instagram