
Virat kohli : ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ మరికాసేపట్లో్ ప్రారంభం కాబోతున్నది. అందరి దృష్టి భారత ఆటగాళ్లపైనే ఉన్నది. ఈ సారి పరుగుల వరద, రికార్డుల మోత ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. అయితే ఈ సారి ముఖ్యంగా భారత అభిమానుల దృష్టంతా రన్నింగ్ మెషిన్ విరాట్ పై ఉంది.
ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్ పోరులో విరాట్ కోహ్లీ రికార్డులు బద్దలు కొట్టే అవకాశం కనిపిస్తున్నది. ఐసీసీ మ్యాచుల్లో ఇప్పటివరకు కోహ్లీ 15 మ్యాచు ఆడి 620 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్ లో కూడా రాణిస్తే సచిన్(657), రికిపాటింగ్(731) పరుగుల రికార్డును దాటేసే అవకాశం ఉంది. ఫైనల్ లో అస్ర్టేలియా తో కాబట్టి మరో 21 పరుగులు చేస్తే టెస్టుల్లో ఆ జట్టుపై 2వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. మరోవైపు మరో 164 పరుగులు కొడితే అసీస్ పై రాహుల్ ద్రవిడ్ కొట్టిన అత్యధిక పరుగులు 2143 రికార్డును కూడా కోహ్లీ దాటేయవచ్చు. అలాగే 108 టెస్టులు ఆడిన విరాట్ ఇప్పటివరకు 8416 పరుగులు చేశాడు. మరో 125 పరుగులు చేస్తే వెస్టిండీస్ ఆటగాడు విలియన్ రిచర్డ్స్ పేరిట ఉన్న 8540 పరుగుల రికార్డును కొట్టేస్తాడు. అదేవిధంగా నాథన్ లైయన్ బౌలింగ్ లో చతేశ్వర్ పూజరా(571) పేరిట ఉన్న అత్యధిక పరుగుల రికార్డును కూడా కోహ్లీ దాటేయవచ్చు. ఇంగ్లాండ్ లో అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో రాహుల్ ద్రవిడ్ 2645 పరుగులతో మొదటిస్థానంలో ఉన్నాడు. కోహ్లీ 2574 పరుగులతో మూడో స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు కోహ్లీ ఆడితే మొదటి స్థానం కైవసం ఖాయం. మరోవైపు అన్ని ఫార్మాట్లు కలిపి విరాట్ ఇప్పటివరకు అస్ర్టేలియాపై 4945 పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో మరో 55 పరుగులు కొడితే 5వేల పరుగుల మైలురాయిని దాటుతాడు. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ర్టేలియా లాంటి దేశాల్లో అత్యధిక సెంచరీల రికార్డు సచిన్ టెండూల్కర్ పై ఉంది. 22 సెంచరీలతో సచిన్ ముందున్నాడు. ఇప్పుడు అది సమం లేదా దాటే అవకాశం కోహ్లీకి ఉంది. కోహ్లీ ఇప్పటికే 21 సెంచరీలు ఆయా దేశాలపై చేశాడు. అంటే ఈ సారి ఒక సెంచరీ కొడితే సమం 2 కొడితే రికార్డు సెంచరీలు విరాట్ ఖాతాలోకి చేరనున్నాయి. గతంలో 2000 సంవత్సరంలో జరిగిన ఐసీసీ చాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో సౌరభ్ గంగూలీ సెంచరీ కొట్టాడు. ఇప్పుడు విరాట్ సెంచరీ చేస్తే 23 ఏండ్ల తర్వాత ఈ ఘనత సాధించిన క్రికెటర్ కానున్నాడు. అంతర్జాతీయ మ్యాచుల్లో విరాట్ ఇప్పటివరకు 75 సెంచరీలు చేశాడు. ఇప్పడు అత్యంత వేగంగా సెంచరీలు సాధించిన క్రికెటర్ గానిలుస్తాడు. విరాట్ 555 మ్యాచుల్లో 75 సెంచరీలు చేశాడు. ఇప్పటివరకు ఈ రికార్డు సచిన్ పై ఉంది. ఆయన ఈ ఘనత 587 మ్యాచుల్లో 75 సెంచరీలు చేశాడు.
WTCఐపీఎల్ సీజన్ లో కూడా తన దైన శైలిలో ఆడాడు. ఇక ఈసారి ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ లో ఇక అభిమానులకు పండుగే. మరికాసేపట్లో లండన్ లోని ప్రఖ్యాత ఓవల్ మైదానంలో ఈ ఫైనల్ ప్రారంభం కానుంది. ఈనెల 11 వరకు ఈ మ్యాచ్ జరగనుంది. మరి టీమిండియా ఈ ఫైనల్ గెలిచి భారత్ కు చేరుకోవాలని భావిస్తున్నది.






