Virushka funny : విరాట్ కోహ్లి అనుష్క జంటకు భలే క్రేజీ ఉంటుంది. వారి జంట ఎక్కడకెళ్లినా అభిమానులు సందడి చేస్తుంటారు. ఈ జంట జామ్ విత్ ఫామ్ ఓ కార్యక్రమానికి హాజరైంది. దీంతో అక్కడ ఉన్న యాంకర్ వారిని పలు ప్రశ్నలు అడిగింది. వాటికి వారు ఠక్కున సమాధానాలు చెప్పారు. వారు అడిగిన కొంటె ప్రశ్నలకు తమదైన శైలిలో జవాబులు చెప్పడం గమనార్హం.
మీ ఫోన్ లో విరాట్ నెంబర్ ఏమని ఫీడ్ చేసుకున్నారని అడిగితే పతి పరమేశ్వర్ అని ఆమె సమాధానం ఇచ్చింది. వీరి జంట నెట్టింట్లో భలే సందడి చేస్తుంది. ప్రేక్షకులతో సరదాగా కబుర్లు చెప్పుకుంటారు. ఇలా వీరు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తుంటారు. అందుకే ప్రతి పిక్ అందరితో పంచుకుని ఎంజాయ్ చేయడం వారికి అలవాటే.
ఈ నేపథ్యంలో విరుష్క జంటతో అభిమానులు తమ ఇష్టాయిష్టాలు పంచుకున్నారు. వారి వ్యక్తిగత విషయాల గురించి కూడా అడిగారు. క్రికెట్ లో ప్రత్యర్థి బ్యాటర్ ఔట్ అయినప్పుడు ఎలా స్పందిస్తారంటే చేసి చూపించడంతో అందరు సంతోషం వ్యక్తంచేశారు. ఇలా విరుష్క జంటతో చాలా సేపు ముచ్చటించారు. క్రికెట్ లో విరాట్ కోహ్లి ప్రస్థానం ఎలా ఉందని ప్రశ్నిస్తే బాగుందని సమాధానం చెప్పారు.
సెలబ్రిటీల గురించి అందరికి ఆసక్తి ఉంటుంది. వారు ఏం చేస్తారు? ఎలా ఉంటారు? ఏం తింటారు? అనే విషయాలపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తారు. వారు కూడా అభిమానులు అడిగే ప్రశ్నలకు విసుక్కోకుండా ప్రశాంతంగా సమాధానాలు చెబుతారు. దీంతో వారిపై అభిమానులకు మరింత ప్రేమ పెరుగుతుంది. వారంటే ఇష్టం కలగడం సహజమే. ఇలా విరాట్ ఎక్కడకెళ్లినా ప్రశ్నలు అడుగుతూనే ఉంటారు.