39.4 C
India
Saturday, June 6, 2026
More

    Indian Idol 2 : 10 వేల మందిని పక్కకు నెట్టి ఇండియన్ ఐడల్ 2 టైటిల్ విన్నర్ గా నిలిచిన విశాఖ అమ్మాయి!

    Date:

    Indian Idol 2
    Indian Idol 2

    Indian Idol 2 : ఓటిటి ప్లాట్ ఫామ్ లలో ఆహా ఒకటి. మన తెలుగులో ఆహా కొద్దీ రోజుల క్రితమే స్టార్ట్ అయిన ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ అందుకుంటుంది. ఇక ఆహా ఓటిటీలో ప్రసారం అవుతున్న పాపులర్ షోలలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 షో ఒకటి.. ఈ ప్రోగ్రాం ఇప్పటికే సీజన్ 1 ను గ్రాండ్ గా ముగించుకుంది. రెండవ సీజన్ కూడా మొదటి సీజన్ లాగానే ఆసక్తికరంగా సాగుతూ వచ్చింది.

    మరి ఈసారి ఇండియన్ ఐడల్ టైటిల్ విన్నర్ గా విశాఖ పట్నంకు చెందిన సౌజన్య భగవతుల నిలిచింది. అలాగే హైదరాబాద్ కు చెందిన జయరాం, సిద్ధిపేట కు చెందిన లాస్య ప్రియా రెండు మూడు స్థానాల్లో నిలిచారు. ఫైనల్ ఎపిసోడ్ ముగియడంతో విన్నర్ తో పాటు తర్వాత స్థానాల్లో నిలిచిన వారికీ కూడా ప్రేక్షకుల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

    ఇదిలా ఉండగా విన్నర్ కు ట్రోఫీ ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఫైనల్ ఎపిసోడ్ కు అతిథిగా విచ్చేసారు.. ఆ సందర్భంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ.. సంగీతంలో అత్యంత ప్రతిభావంతులైన తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్ 2 కంటెస్టెంట్స్ ను చుసి మనసంతా ఆనందంతో నిండిపోయింది అని ముఖ్యంగా సౌజన్య రెండేళ్ల పసిబిడ్డను పెట్టుకుని ఈ పోటీల్లో పాల్గొనడం ఫైనల్ ట్రోఫీ అందుకోవడం నాకు సంతోషంగా అనిపించింది.

    ఒక పక్క కుటుంబ బాధ్యతలు ఉన్న సంగీత అబ్యాసం చేసి ఇంత మందిని అధిగమించి టైటిల్ గెలవడం సాధారణ విషయం కాదు.. అందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలుపు తున్నాను.. పెళ్లి అయిన మహిళ ఈ స్థాయికి చేరుకోవడానికి భర్త, కుటుంబం సపోర్ట్ ఉండాలి.. ఈమెకు సపోర్ట్ గా నిలిచినా వీరిని కూడా ప్రశంసించాలి.. ఈమె మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నాను” అంటూ ముగించాడు.

    ఇక సౌజన్య టైటిల్ విన్నర్ అవ్వడంతో ఆమె సంతోషంగా ఉంది.. అలాగే అల్లు అర్జున్ తన గురించి మాట్లాడడం నేను కలలో కూడా ఊహించలేదు.. ఆయన చేతుల మీద ట్రోఫీ అందుకోవడం అదృష్టంగా భావిస్తాను.. ఈ షో నా లోని పట్టుదల, కృషిని మరింత పెంచాయి అంటూ తెలిపింది. మరి దాదాపు 10 వేల మందిని అధిగమించి టైటిల్ విన్నర్ గా నిలిచిన ఈమెకు టాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు వస్తాయో రావో చూడాలి..

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related