
Vishal : కోలీవుడ్ స్టార్ హీరోల్లో విశాల్ ఒకరు.. ఈయన తెలుగు వారే అయినప్పటికీ కోలీవుడ్ లో ఎప్పుడో సెటిల్ అవ్వడంతో విశాల్ కూడా అక్కడే హీరోగా ఎంట్రీ ఇచ్చి రాణిస్తున్నాడు.. ఈయనకు తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా ఫాలోయింగ్ ఉంది.. ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నాడు..

ఇక సినిమాల్లోనే కాకుండా బయట కూడా పలు సేవ కార్యక్రమాలు చేస్తూ మంచి పేరు తెచ్చుకుని తమిళ్ ప్రజల్లో రియల్ హీరో అనిపించు కున్నాడు.. మరి ఈయన కెరీర్ సంగతి పక్కన పెడితే ఈయన ఇప్పటికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్.. 45 ఏళ్ళు వచ్చిన ఈయన ఇంకా పెళ్లి చేసుకోలేదు..
అయితే కరోనా లాక్ డౌన్ ముందు అనీషాతో ఈయన ఎంగేజ్మెంట్ జరిగింది.. కానీ ఆ బంధం పెళ్లి వరకు వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోయింది.. పెళ్లి ఆగిపోవడంతో ఈయన పెళ్లిపై మళ్ళీ హాట్ టాపిక్ అవుతుంది.. ఎవరిని చేసుకుంటాడు.. ఎప్పుడు చేసుకుంటాడు అనే చర్చ అభిమానుల్లో ఆసక్తిగా మారింది..
మరి ఇన్ని రోజులకు ఫ్యాన్స్ కు ఒక గుడ్ న్యూస్ తెలుస్తుంది.. ఒకప్పటి స్టార్ హీరోయిన్ లక్ష్మి మీనన్ (Lakshmi Menon).. పెళ్లి పీటలు ఎక్కబోతుంది అని వార్తలు రాగా ఆమె చేసుకోబోయేది విశాల్ నే అనే టాక్ తమిళ్ ఇండస్ట్రీలో వైరల్ అయ్యింది.. వీరిద్దరూ కలిసి నటించి మెప్పించారు. ఈ జంటకు ఆడియెన్స్ ఫిదా అవ్వగా ఎప్పటి నుండో వీరు లవ్ లో ఉన్నారని ఈ విషయాన్నీ ఇంట్లో వాళ్లకు చెప్పకుండా దాచారని అంటున్నారు.. చూడాలి ఇది ఎంత వరకు నిజమో..