
Vishnupriya Controversial : తన మాటల ప్రవాహంతో యాంకర్ గా తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న యాంకర్ విష్ణుప్రియ అంటే అందరికి తెలుసు.. ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. ముందుగా సినిమాల్లో నటించి తన అదృష్టాన్ని పరీక్షించు కుంది.. అయితే వెండితెర మీద ఈమె సక్సెస్ కాలేక పోయింది.
దీంతో విష్ణు ప్రియ వెండితెరకు గుడ్ బై చెప్పి బుల్లితెర మీద ఎంట్రీ ఇచ్చింది. చిన్న చిన్నగా ఈమె కెరీర్ ను స్టార్ట్ చేసి ఆ తర్వాత మంచి యాంకర్ గా అందరి మదిలో నిలిచి పోయింది.. పోవే పోరా వంటి షోతో సుధీర్ తో పాటు హోస్ట్ గా చేసి యూత్ లో భారీ ఫాలోయింగ్ తెచ్చుకుంది.
ప్రజెంట్ ఈమె క్యూట్ నెస్ తో పాటు హాట్ నెస్ తో కూడా ప్రేక్షకుల మనసులను దోచుకుంటుంది.. సోషల్ మీడియాలో ప్రతీ నిత్యం హాట్ ఫోటోలను షేర్ చేస్తూ వార్తల్లో నిలుస్తూనే ఉంది.. ఇదిలా ఉండగా విష్ణు ప్రియా అప్పుడప్పుడు నోరు జారి కొన్ని మాటలు అంటూ ఉంటుంది.
ఆమె చేసిన కామెంట్స్ ఒక్కోసారి వైరల్ అయ్యి కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తాయి.. ఇలాంటి పనినే తాజాగా ఈ అమ్మడు మరోసారి చేసింది.. తాజాగా విష్ణుప్రియ సుమ హోస్ట్ గా చేస్తున్న సుమ అడ్డా ప్రోగ్రాం కు ధారనరాజ్, బలగం వేణు, చమ్మక్ చంద్రతో కలిసి వెళ్ళింది..
మరి ఇదే వేదికపై పెండ్లి అంటే ఏం గుర్తుకు వస్తుందో చెప్పాలని సుమ అడుగగా.. విష్ణుప్రియ ముందుగా షాపింగ్, బంధువులు అని ఆ తర్వాత శోభనం అని గట్టిగ అరిచింది. పెళ్లి అంటే శోభనం గుర్తుకు వచ్చింది కానీ తాళిబొట్టు గుర్తుకు రాలేదా అంటూ వేణు పంచ్ వేయడంతో విష్ణుప్రియకు పెద్ద పంచ్ పడింది. ఇలా తాజాగా వచ్చిన ప్రోమోలో ఈమె చేసిన ఈ కామెంట్స్ తో మరోసారి వార్తల్లో నిలిచింది.