Voting Rights In India :
దీనికి గాను ఎన్నికల సంఘం ఓ కొత్త పద్ధతి తీసుకొచ్చింది. మన ఓటు ఎవరైనా వేసినా, ఓటరు జాబితాలో మన పేరు గల్లంతయినా ఓటరు కార్డు లేదా ఆధార్ కార్డు చూపించి సెక్షన్ 49ఏ కింద చాలెంజ్ ఓటు వేసుకునే వెసులుబాటు కల్పించనుంది. దీంతో దొంగ ఓట్లు వేసినా మన ఓటు మనం వేసుకునే అవకాశం కలుగుతుంది. ఎన్నికల సంఘం తీసుకొచ్చిన నిబంధనలు అందరికి ఆమోదయోగ్యంగానే ఉన్నాయి.
మన ఓటు అప్పటికే ఎవరైనా వేసినట్లయితే భయపడకుండా టెండర్డ్ ఓటు అడగొచ్చు. నిర్భయంగా నా ఓటు నేనే వేసుకుంటానని చెప్పొచ్చు. దీనికి కూడా మనకు అనుకూలమైన నిబంధన తీసుకురావడం గమనార్హం. ఇలా ఓటు వేసే సమయంలో మనకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేయడం అభినందనీయమే.
ఏ బూత్ లో అయినా 14 శాతం కంటే ఎక్కువ టెండర్ ఓట్లు పడితే అక్కడ రీ పోలింగ్ నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది. దీంతో రాబోయే ఎన్నికలు అత్యంత కీలకంగా మారనున్నాయి. ఓటు వేసే సందర్భంలో ఎలాంటి పొరపాట్లు జరిగినా మొదటికే మోసం వస్తుంది. అందుకే అధికారులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని తెలుసుకోవాలి.
ReplyForward
|