
Vyuham Another Photo : సంచలనాల దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తున్న చిత్రం ‘వ్యూహం’. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల కథ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు వర్మ. రెండు రోజుల ముందు మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు. ఇందులో వైఎస్ జగన్ పాత్ర, చంద్రబాబు పాత్రలను పరిచయం చేశాడు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి టీజర్ లో ఎక్కడా ప్రస్తావించలేదు. దీన్ని చూసిన సినీ అభిమానులు, పవన్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటుంటే మరో ట్వీట్ తో రాంగోపాల్ వర్మ సంచలనం సృష్టించాడు.
‘వ్యూహం’ సినిమా వైఎస్ జగన్ కోసం, ఆయనకు మద్దతుగా రాంగోపాల్ వర్మ తీశారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. అయితే వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయినప్పటి నుంచి సన్నివేశాలను టీజర్ లో వివరించాడు వర్మ. అయితే అప్పటి వరకు పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాలేదు. దీంతో పవన్ ప్రస్తావన ఉంటుందా..? అన్నసందేహం చాలా మందికి కలిగింది. కానీ వర్మ ట్విటర్ ద్వారా రీలీజ్ చేసిన ఈ ఫొటోతో ఆ డౌట్ క్లారీఫై అయ్యింది. వైఎస్ చనిపోయినప్పటి నుంచి ప్రస్తుతం 2024 రాజకీయాల వరకు ఏపీ రాజకీయాల్లో జరిగిన పరిణామాల నేపథ్యంలోనే ఈ సినిమా సాగుతుందని తెలుస్తోంది.
వర్మ రిలీజ్ చేసిన పొటోలో ఒక వైపు మెగాస్టార్ చిరంజీవి కూర్చోగా తన బావమరిది అల్లు అరవింద్ తో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నట్లు ఉన్న సీన్ పిక్ ను వర్మ అప్ లోడ్ చేశాడు. ఈ సినిమాలో జనసేనతో పాటు ప్రజారాజ్యం ప్రస్తావన కూడా వర్మ తెస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ను చాలా ఏళ్లుగా వర్మ విమర్సిస్తూ వస్తున్నారు. గతంలో తీసిన సినిమా ‘కమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’ సినిమాలో కూడా పవన్ కళ్యాణ్ ను నెగెటివ్ రోల్ లో చూపించారు. ఈ సినిమా రిలీజ్ అయితే మరో సారి ఏపీ రాజకీయాల దిశను మారుస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు.