
walking : మనం ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాం. ఉదయం పూట చాలా మంది వాకింగ్ చేస్తున్నారు. నడక ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ పేషెంట్లు రోజు క్రమం తప్పకుండా నడిస్తే ఎంతో లాభం ఉంటుంది. కానీ ఎంత దూరం నడవాలి? ఎలా నడవాలి? అనే దానిపై సందిగ్దం నెలకొంటుంది. దీంతో దీనిపై ఉన్న అనుమానాలను పటాపంచలు చేస్తున్నారు. రోజకు కనీసం పదివేల అడుగులు వేయాలని సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆరోగ్యానికి ఎంతో సురక్షితమని చెబుతోంది.
నడక వల్ల మధుమేహం కంట్రోల్ లో ఉంటుంది. క్రమం తప్పకుండా వాకింగ్ చేస్తే ఎముకలు బలంగా తయారవుతాయి. డయాబెటిస్, బీపీ, కొలెస్ట్రాల్, కీళ్లు, కండరాల నొప్పులు నియంత్రణలో ఉంటాయి. రోజు వాకింగ్ చేస్తే ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయి. ఈ విషయం గమనించి నడక కొనసాగించడం ఎంతో మంచిది. దీన్ని పలు పరిశోధనలు తెలియజేస్తున్నాయి. పదివేల అడుగులు నడిస్తే మంచి ప్రయోజనాలు ఉంటాయి. వయసు రీత్యా అంతకన్న తక్కువ అడుగులు వేసినా లాభమే. కానీ క్రమం తప్పకుండా రోజు నడవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. ఫిట్ నెస్ సాధిస్తారు. ఇలా నడక వల్ల మనకు చాలా మేలు కలుగుతుంది. నడకను ఎవరు కూడా నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించడం ఎంతో ప్రయోజనం.
రోజురోజుకు కొంత దూరం పెంచుకోవచ్చు. నడక దూరం పెంచుకుంటూ పోతే మనకు ఉన్న రోగాలు దూరం అవుతాయి. నడక వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. దాదాపు 25 రకాల రోగాలు నడక నయం చేస్తుంది. ఇలా నడకతో మనకు దీర్ఘకాల ప్రయోజనాలు దక్కడం సహజం. ఈ నేపథ్యంలో నడక శరీరానికి మంచిదే అని గుర్తించాలి.