19.8 C
India
Sunday, February 25, 2024
More

    Jai Sriram Caller Tune : జై శ్రీరామ్’ కాలర్ ట్యూన్ కావాలనుకుంటున్నారా? ఇది ఫాలో అయితే సరిపోతుంది.

    Date:

    Jai Sriram Caller Tune
    Jai Sriram Caller Tune

    Jai Sriram caller tune : అయోధ్య రామాలయంలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. దేశం యావత్తు రామనామ జపంతో ఊగిపోతోంది. అయోధ్య రాముడిని ఎప్పుడెప్పుడు గర్భగుడిలో చూసి దర్శించుకుందామా అని వేయి ఆశలతో ఎదురు చూస్తోంది. దేశమే కాదు ప్రపంచంలో ఏ ఇద్దరు కలిసినా రామ మందిరంపైనే చర్చించుకుంటున్నారు. నెట్ వర్క్ యూజర్లు సైతం రాముడి పాలను వారి కాలర్ ట్యూన్లుగా సెట్ చేసుకునేందుకు అవకాశాలను కల్పిస్తున్నాయి. అదెలాగో ఇక్కడ చూద్దాం.

    వొడాఫోన్ లో..
    వొడాఫోన్-ఐడియా యూజర్లు ‘వీఐ’ యాప్‌ డౌన్ లోడ్ చేసుకోవాలి. కాలర్ ట్యూన్స్ విభాగంలోకి వెళ్లాలి. అక్కడ కేటలాగ్ కనిపిస్తుంది. వాటిలో సెర్చ్ చేస్తే శ్రీరాముడి శ్లోకాలు కనిపిస్తాయి. అందులో ఇష్టమైన పాటను కాలర్‌ ట్యూన్‌గా పెట్టుకోవచ్చు.

    ఎయిర్ టెల్ వినియోగదారులకు…
    ఎయిర్ టెల్ యూజన్లు ‘వింక్ మ్యూజిక్‌’ యాప్‌ డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్‌లోకి లాగిన్ అవ్వాలి. సెర్చ్ బాక్స్‌లో ‘శ్రీరామ్‌ భజనలు’ అని టైప్‌ చేస్తే రాముడి పాటలు వస్తాయి. వాటిలో మీకు ఇష్టమైనది కాలర్ ట్యూన్ గా సెట్‌ చేసుకోవచ్చు. ఇదంతా ఉచితంగానే అవకాశం కల్పిస్తుంది వింక్ మ్యూజిక్ యాప్. నెల పాటు కాలర్‌ ట్యూన్‌గా ఉంటుంది. ఆ తర్వాత రెన్యువల్ చేసుకోవాలి. ఫీచర్ ఫోన్ ఉపయోగిస్తున్నట్లయితే 543211కు కాల్ చేయడం ద్వారా ఇష్టమైన పాటను ఎన్నుకోవచ్చు.

    జియోలో..
    జియో యూజర్లు ‘జియో సావన్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలి. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ట్రెండింగ్ నౌకు వెళ్లాలి. అక్కడ జియో ట్యూన్ ఆప్షన్ ను ఎంచుకోవాలి.
    సెర్చ్ బాక్స్‌లో ‘జై శ్రీరామ్’, ‘రామ్ హారతి’, ‘రామ్ భజన’, ‘శ్రీరామ్ సాంగ్స్‌’ ఎంటర్ చేస్తే అందుబాటులో ఉన్న అన్ని ఆప్షన్లు చూపిస్తుంది. అందులో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆ తర్వాత సెట్ జియో ట్యూన్ పై క్లిక్ చేయండి. ఎస్ఎంఎస్ ద్వారా కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. ఫీచర్ ఫోన్ ఉంటే, 56789కు కాల్ చేయడం ద్వారా కూడా ఇష్టమైన రాముడి పాటను కాలర్ ట్యూన్ గాపెట్టుకోవచ్చు.

    Share post:

    More like this
    Related

    TDP-Janasena : ఏ వర్గానికి ఎన్ని సీట్లు జగన్ పై గెలుపు లెక్కలు సరవుతాయా?

    TDP-Janasena : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ సారి సామాజిక లెక్కలు గెలుపు...

    Prabhas : తనలో సీక్రెట్ బయట పెట్టేసిన ప్రభాస్

    Prabhas : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్,...

    SHE Teams : ప్రేమ జంటలకు షీ టీం షాక్.. ఏం చేసిందంటే?

    SHE Teams : ప్రేమకు అర్థం (నిర్వచనం) మారిపోయిందేమో. ఒకప్పుడు లవ్...

    Jagan : కొండతో సామాన్యుడి ఢీ.. జగన్ పై పోటీ చేసేది ఇతనే.. ఇతని బ్యాగ్రౌండ్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    Jagan : టీడీపీ+జనసేన పొత్తులో భాగంగా ఫస్ట్ లిస్ట్ ను బాబు,...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related