29.3 C
India
Tuesday, February 10, 2026
More

    Want to buy a new car : కొత్త కారు కొనాలనుకుంటున్నారా.. ఈ శుభవార్త మీకోసమే.. రూ.వేలల్లో డిస్కౌంట్!

    Date:

     

     

    
    

    Want to buy a new car : ఫ్యామిలీ కోసం కారు కొనాలనుకుంటున్నారా..? అయితే ఈ శుభవార్త మీకోసమే. టాటా మోటార్స్ ఇప్పుడు తన కంపెనీ కారుపై భారీగా తగ్గింపు ఇస్తుంది. రూ. వేలల్లో డిస్కౌంట్ చేసుకోవచ్చు. ఈ డీల్ ను ఒక్కసారి పరిశీలించండి. వాహన తయారీ సంస్థ టాటా మోటార్స్ కొన్ని మోడళ్లపై డిస్కౌంట్ తీసుకువచ్చింది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

    ఇందులో ప్రముఖ హ్యాచ్ బ్యాగ్ కారు టాటా టియాగో మోడల్ పై బ్రహ్మాండమైన ఆఫర్లు ఉన్నాయి. రూ. 20 వేల వరకు క్యాష్ డిస్కౌంట్ ఇవ్వడంతో పాటు రూ. 10వేల వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు కూడా ఇస్తుంది. దీనితో పాటు కార్పొరేట్ డిస్కౌంట్ మరో రూ. 5వేల వరకు ఇస్తుంది. అంటే కొనుగోలుపై పూర్తిగా రూ. 35వేల వరకు తగ్గింపు పొందవచ్చన్నమాట. ఒక వేళ ఇదే కంపెనీలో టిగోర్ సెడాన్ కారు కొనాలనుకుంటే రూ. 15వేలు, అంటే రూ. 10వేల ఎక్స్చేంజ్ ఆఫర్, కార్పొరేట్ డిస్కౌంట్ మరో రూ. 5వేల వరకు ఇస్తుంది.

    ఈ రెండు మోడల్స్ తో పాటు టాటా ఆల్ట్రోజ్ పై కూడా తగ్గింపు లభిస్తోంది. క్యాష్ డిస్కౌంట్ రూ. 10 వేలు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేలు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ. 3 వేలు వస్తుంది. నెక్సన్ పై కార్పొరేట్ డిస్కౌంట్ మాత్రమే ఉంది. దీనిపై రూ. 3 వేల తగ్గింపు పొందొచ్చు. టాటా హరియర్ పై రూ. 25 వేల వరకు ఎక్స్చేంజ్ బోనస్ ఉంది. రూ.10 వేల కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తుంది కంపెనీ. సఫారి మోడల్‌కు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుంది.

    ఈ ఆఫర్లు ఈ నెల(జూన్)లో మాత్రమే అందుబాటులో ఉంటాయట. అంటే జూన్ 30వ తేదీ వరకే డీల్స్ పొందచ్చు. ఆఫర్లు అనేవి డీలర్‌ షిప్, మోడల్, వేరియంట్, ప్రాంతం ప్రాతిపదికన మారుతాయని కంపెనీ ప్రకటించింది. సో దగ్గరిలోని షోరూంకు వెళ్లి ఆఫర్ తెలుసుకోవడం ఉత్తమం. ఆ తర్వాతే కారు కొనాలా? వద్దా ? అనే నిర్ణయానికి రావొచ్చు. కేవలం టాటానే కాకుండా హోండా, నిస్సాన్ ఇండియా, మారుతి సుజుకీలు కూడా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Ratan Tata : రతన్‌ టాటా యువ స్నేహితుడికి.. టాటా మోటార్స్‌లో కీలక పదవి

    Ratan Tata Friend Shantanu Naidu: దిగ్గజ పారిశ్రామికవేత్త రతన్‌ టాటా ...

    Top-10 Cars : జనవరిలో ఎక్కువ ఆదరణ పొందిన కార్లు ఇవే?.. టాప్ 10 చూద్దాం..

    Top-10 Cars : గత నెల (జనవరి) అమ్మకాల జాబితాలను దేశీయ...