
Waqf Amendment Act : వక్ఫ్ సవరణ చట్టం బిల్లుపై 21 మంది లోక్ సభ, 10 మంది రాజ్యసభ ఎంపీలతో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)ని నియమించారు. ఇందులో నలుగురు తెలుగు రాష్ట్రాల ఎంపీలకు అవకాశం లభించింది. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ (హైదరాబాద్), బీజేపీ ఎంపీ డీకే అరుణ (మహబూబ్ నగర్), టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (నరసరావుపేట), వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి (రాజ్యసభ) సభ్యులుగా ఉంటారు.
వక్ఫ్ చట్టంలో కీలక మార్పులు తెచ్చే దిశగా రూపొందించిన సవరణ బిల్లుపై కేంద్ర ప్రభుత్వం కాస్త వెనక్కి తగ్గిన సంగతి తెలిసిందే. గురువారం లోక్ సభలో ప్రవేశపెట్టిన ఈ బిల్లుపై విపక్షాల నుంచి పెద్ద ఎత్తు వ్యతిరేకత రావడంతో దీనిని జేపీసీ పరిశీలనకు పంపించనున్నట్లు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించారు.