War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్ 2 టీజర్ యాక్షన్, స్టైల్, విజువల్స్ తో విపరీతమైన స్పందన తెచ్చుకుంది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ తో కలిసి చేసిన ఈ మల్టీస్టారర్ సినిమాలో, అతని పవర్ఫుల్ డైలాగ్స్, మాస్ యాక్షన్ సన్నివేశాలు ఫ్యాన్స్ కి గూస్‌బంప్స్ ఇచ్చాయి. హాలీవుడ్ స్థాయిలో నిర్మాణ విలువలు కనిపించాయి. కియారా అద్వానీ గ్లామర్ అదనపు ఆకర్షణగా నిలిచింది. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం, ఎన్టీఆర్ ని హిందీ మార్కెట్ లో మరింత బలంగా నిలిపే అవకాశం ఉంది. వార్ 2 టీజర్ బ్లాక్‌బస్టర్ హింట్ ఇస్తోంది!.