
Warner Brothers : తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు యూఎస్ లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పారిశ్రామిక వేత్తలతో విరివిగా భేటీ అవుతున్నారు. రీసెంట్ గా మంత్రి డిస్కవరీ ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ఛానల్ టీవీ, మూవీస్, స్ట్రీమింగ్ ప్లాల్ ఫారం, గేమింగ్, బ్రాండ్, ఫ్రాంచైజీల పోర్ట్ ఫోలియోకు ప్రసిద్ది చెందిన గ్లోబల్ మీడియా, ఎంటర్ టైన్ మెంట్ సమ్మేళం. ఇక ఈ వినోదాన్ని తెలంగాణకు తీసుకచ్చేందుకు మంత్రి వారితో సమావేశమై మాట్లాడారు.
వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ తెలంగాణకు వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీనిపై కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ వినోద రంగంలోకి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ రావడం చాలా సంతోషకరం. క్రియేటివిటీ, ఇన్నోవేషన్ హబ్ గా ఐడీసీని డిస్కవరీ ఏర్పాటు చేస్తుందని చెప్పారు. ఈ సంస్థ రావడం వల్ల మొదటి ఏడాది 1200 మందికి ఉపాధి దొరుకుతుందని మంత్రి వెల్లడించారు.
ఇటీవల ఆయన బ్రిటన్ లో కూడా పర్యటించారు. అక్కడి కంపెనీలను కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని అభ్యర్థించారు. కేటీఆర్ కోరికమేరకు ఆ కంపెనీలు కూడా సుముఖత వ్యక్తం చేశాయి. హైదరాబాద్‌లో సాంకేతిక కేంద్రాన్ని (టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) ఏర్పాటు చేసేందుకు లండన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సమ్మతించింది. టెక్నాలజీ సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ సుమారు 1000 మందిని రిక్రూట్ చేసుకోనుంది. ఈ విషయాన్ని లండన్‌లో లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ గ్రూప్ సీఈవో అంథోనీ మెక్‌కార్టీ కేటీఆర్ కు వివరించారు. మంత్రి సమక్షంలో దీనికి సంబంధించిన అవగాహన ఒప్పందాన్ని పరిశ్రమల శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డితో ఆంటోనీ మెక్ కార్టీ ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకున్నారు.
తెలంగాణలో ఈ సంస్థ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ద్వారా హైదరాబాద్ నగరంలోని బ్యాంకింగ్, ఫైనాన్స్ సర్వీసెస్, ఇన్య్సూరెన్స్ రంగాలకు ఊతమిచ్చినట్లు అవుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు. వీటికి అనుబంధ రంగాల్లో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని మంత్రి చెప్పారు. లండన్ స్టాక్ ఎక్స్ చేంజ్ గ్రూప్ దాదాపు 190 దేశాల్లో సేవలు అందిస్తోంది. విస్తృతమైన కార్యకలాపాలతో ప్రపంచంలోని ఫైనాన్షియల్ రంగంలో దిగ్గజ సంస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది.