David Warner : పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ 20 మ్యాచ్ లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్ లో ఆతిథ్య జట్టుపై 37 పరుగుల తేడాతో వెస్టిండీస్ గెలిచింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 220 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. ఆ తర్వాత భారీ లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా జట్టు కేవలం 183 పరుగులు మాత్రమే చేయగలిగింది. మ్యాచ్ ఓడిపోయినా సిరీస్ మాత్రం ఆస్ట్రేలియాను గెలుచుకుంది. ఈ సిరీస్ విజయంలో డేవిడ్ వార్నర్ కీలక పాత్ర పోషించాడు. 3 మ్యాచ్ ల్లో రెండు హాఫ్ సెంచరీలు చేసి 173 పరుగులు సాధించాడు. స్ట్రైక్ రేట్ కూడా 166 కంటే ఎక్కువే ఉంది. దీంతో వార్నర్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ దక్కింది.
గ్రౌండ్ లో తన దూకుడైన బ్యాటింగ్ తో అభిమానులు మంత్రముగ్ధులను చేసే వార్నర్.. ఆఫ్ ది ఫీల్డ్ లోనూ అందరి మనసులు గెలుచుకున్నాడు. ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలుచుకున్న తర్వాత వార్నర్ చేసిన పని అందరినీ ఆశ్చర్యంలో ముంచేసేంది. ఆ అవార్డు అందుకున్న వార్నర్ దానిని స్టేడియంలో కూర్చున్న చిన్నారికి ఇచ్చాడు. వార్నర్ తన ట్రోఫీని చిన్నారికి ఇవ్వడంతో ఆమె ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వార్నర్ మ్యాచ్ ల సమయంలో అభిమానులకు తరుచుగా ఇలా బహుమతులు ఇస్తుంటాడు. గతంలో పలు సందర్భాల్లోనూ తన గ్లోవ్స్ ను స్టేడియంలోని ఆడియన్స్ కు కానుకగా ఇచ్చాడు. ఇప్పుడు పెర్త్ గ్రౌండ్ లోనూ ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ ట్రోఫీని చిన్నారికి ఇవ్వడంపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి ఈ ట్రోఫీలు రావడమే అరుదు. ఆటగాళ్లు వీటిని ఎంతో భద్రంగా దాచుకుంటూ ఉంటారు. వార్నర్ ఇలాంటి వాటికి ఆతీతుడు కాబట్టి.. తన అభిమానులకు ఇలా మరుపురాని కానుకలు అందిస్తూ వారి ప్రేమను పొందుతుంటాడు.
ఇదిలా ఉండగా.. వార్నర్ గత నెలలో టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ఇచ్చాడు. ఇక ఈ ఏడాది జరుగనున్న టీ 20 వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీ తర్వాత ఈ ఫార్మాట్ కు కూడా రిటైర్ మెంట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక స్వదేశంలో వార్నర్ కిదే చివరి టీ 20 సిరీస్ అని చెప్పవచ్చు.
We hear about gifting awards to other teammates but David Warner takes it to next level by gifting his Player of the Series to a fan.#AUSvWI pic.twitter.com/4vgVKivaoq
— Kausthub Gudipati (@kaustats) February 13, 2024