
Spirit : సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్/అక్టోబర్‌లో ప్రారంభం కానున్నట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లే రాసేందుకు డైరెక్టర్ 6 నెలల సమయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో రెబల్ స్టార్ పోలీసుగా కనిపించనుండగా, స్టంట్స్‌తో కూడిన భారీ యాక్షన్ సీన్స్ ఉంటాయని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రభాస్ రాజాసాబ్, ఫౌజీ షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.