- ఐపీఎల్ జట్టు నుంచి అవుట్ నిజమేనా..?

Washington Sundar : సినిమా హీరోయిన్లతో క్రికెటర్ల ప్రేమాయాణాలు కామనే. చాలానే ఇలాంటి కథలు ఉన్నాయి. సౌరవ్ గంగూలీ, శ్రీశాంత్, విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్, హర్భజన్ సింగ్ ఇలా చాలా మంది ఇలాంటి ఎఫైర్లతో ప్రాచుర్యంలోకి వచ్చిన వారే. అయితే ప్రేమాయాణాలు ఎలా ఉన్నా ఎక్కడా తమ కెరీర్ దెబ్బతినకుండా ప్లాన్ చేసుకున్నారు. తమ కెరీర్ లో సక్సెస్ రేట్ ను దాటి తమకంటూ ఓ కుటుంబ జీవితాన్నిగడుపుతున్నారు. అయితే ఇక్కడ ఐపీఎల్ ఆడేందుకు వచ్చిన ఓ క్రికెటర్ మాత్రం ఖాళీ సమయంలో హైదరాబాద్ లో ఓ యాంకర్ తో కలిసి చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్నట్లు సమాచారం.
క్రికెటర్ వాషింగ్టన్ సుందర్. ప్రస్తుతం ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నాడు. ఒకటి రెండు మ్యాచ్లు అదరగొట్టాడు. అంతలోనే గాయం కారణంగా వైదోలిగాడు. అయితే ఈ కుర్ర క్రికెటర్ హైదరాబాద్లో ఉండే ఓ తెలుగు యాంకర్ తో కొన్నాళ్లుగా తిరుగుతున్నట్లు సమాచారం. ఇద్దరు కలిసి ఇటీవల ఒకరోజంతా హైదరాబాద్ లో జాలిగా గడిపినట్లుగా వార్తలు బయటకు వచ్చాయి. తెలుగు టీవీల్లో కనిపించే ఓ యాంకర్ తో వాషింగ్టన్ ఎఫైర్ పై జట్టు యాజమాన్యానికి తెలవడంతో సీరియస్ గా తీసుకున్నట్లుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయనపై చర్యలు తీసుకున్నట్లు తెలసింది.
ఇప్పుడిప్పుడే క్రికెట్ లో కుదురుకుంటున్న వాషింగ్టన్ ఇలాంటి ఎఫైర్లతో తన కెరీర్ నాశనం చేసుకోవడం ఏంటని అంతా అనుకుంటున్నారు. సదరు యాంకర్ పై నా కూడా విమర్శలు చేస్తున్నారు. సదరు యాంకర్ కూడా ఈటీవీలో పలు షోలలో కనిపించింది. ప్రస్తుతం కూడా పలు ఈవెంట్లలో ప్రముఖంగా కనిపిస్తున్నది. అ యితే ఇటీవల ఐపీఎల్ మ్యాచ్ ల్లో స్టేడియంలో దిగిన ఫొటోలను ఎక్కువగా షేర్ చేిసింది. వాషింగ్టన్ సుందర్ కోసమే అక్కడికి వెళ్లిందా అని అంతా మాట్లాడుకుంటున్నారు.