
సాధారణంగా మనం హెల్డీగా ఉండడం కోసం స్వచ్ఛమైన నీరు తాగేందుకే ఎక్కువగా ఇష్టపడుతుంటాం. అందుకోసం మినరల్ వాటర్‌కే ఎక్కువగా ప్రాధాన్యమిస్తాం. బయట ప్రదేశాల్లో ప్రయాణించినప్పుడు, టూర్లకు వెళ్లినప్పుడు ఆయా ప్రాంతాల్లో ట్యాబ్ నీరు త్రాగకుండా మినరల్ వాటర్ బాటిల్స్‌ను కొనుగోలు చేస్తాం. లోకల్ వాటర్ తాగేందుకు దాదాపు అయిష్టతనే ప్రదర్శిస్తుంటాం. మినిరల్ వాటర్ తాగడం వల్ల స్వచ్ఛమైన నీరును తాగుతున్నట్లే ఫీలవుతుంటాం. ఆరోగ్యం బాగుండాలనే ఉద్దేశ్యంతో అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటాం. అందుకే మినిరల్ వాటర్ బాటిల్స్‌ను ఆయా ప్రాంతాల్లో ఎంతై ఖర్చైన కొనేందుకు వెనకాడం. మినిరల్ వాటర్ బాటిల్స్‌లోని వాటర్ దాదాపు సేఫ్ అనుకుంటాం.
కానీ,అలా అనుకుంటే పప్పులో కాలేసినట్లే..! బస్టాండ్లు,రైల్వే స్టేషన్లలో బ్రాండెండ్ వాటర్ బాటిల్స్ పేరుతో అమ్ముతున్న మినరల్ వాటర్ బాటిల్స్ అన్నీ మూమూలు ట్యాబ్ వాటరేనని తేలుతోంది. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఎక్కువగా కొందరు ఇలాంటి పనులు చేస్తున్నట్లు కనిపిస్తుంది. ట్యాప్ వాటర్‌ను బ్రాండెండ్ వాటర్ బాటిల్స్‌లో నింపి వాటిని రైళ్లలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు అమ్ముతున్నారు.
ఇప్పటి వరకు స్టేషన్లలో ఫుడ్ ఐటెమ్సే క్వాలిటీగా ఉండవనుకుంటే..వాటర్ బాటిల్స్ అమ్మకాల్లో కూడా ఇలాంటి పనులే జరుగుతుండడం షాక్‌కు గురి చేస్తోంది. కొద్ది రోజులు క్రితం ఇలాగే ఓ రైల్వే స్టేషన్‌లో ట్యాబ్ వాటర్‌ను బ్రాండెండ్ వాటర్ బాటిల్స్‌ల్లో నింపుతూ..ఓ వ్యక్తి అడ్డంగా దొరికిపోయారు. అందుకు సంబంధించి ఒక్కసారి ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతోంది. రైల్వే స్టేషన్లలో సిచ్యుయేషన్ ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమైపోతుంది. రైళ్లలో ప్రయాణించేటప్పుడు మనం తాగే నీళ్లు ఇవేనా..అని ఆశ్చర్యపడక తప్పదు.






