Wayanad Tragedy : పీఎం నరేంద్ర మోదీ కన్నూరు విమానాశ్రయం నుంచి వయనాడ్ చేరుకున్నారు. కొండచరియలు పడి దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేపట్టారు. ఈ సందర్భంగా ప్రకృతి ప్రకోపానికి తుడిచిపెట్టుకు పోయిన ప్రాంతాల్లో మోదీ పర్యటిస్తున్నారు. హెలికాప్టర్ ద్వారా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ సాగుతున్న సహాయక చర్యలు, బాధితుల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ప్రధాని వెంట కేరళ గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి పినరయి విజయన్, కేంద్ర మంత్రి సురేశ్ గోపి, అధికారులు ఉన్నారు.
వయనాడ్ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటనపై లోక్ సభలో విపక్షనేత రాహుల్ గాంధీ స్పందించారు. కొండచరియలు విరిగిపడిన ప్రాంతాల్లో పీఎం మోదీ పర్యటిస్తున్నందున ధన్యవాదాలు తెలిపారు. ఇది సరైన నిర్ణయమన్నారు. ఇప్పటికైనా వయనాడ్ విళయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కోరుకుంటున్నట్లు చెప్పా