Rudraksha : జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని అందరు అనుకుంటారు. తమ పిల్లల కోసం ఆస్తులు కూడబెట్టాలని కలలు కంటారు. కానీ అది అందరికి సాధ్యం కాదు. చేసే పనుల్లో కలిసి రావాలని కోరుకుంటారు. అది వ్యాపారమైనా, ఉద్యోగమైనా ఉన్నతంగా ఎదగాలని ఆశిస్తుంటారు. దీని కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. కొందరికి మాత్రం ఎంత కష్టపడినా కలిసి రాదు.
మనం చేసే పనుల్లో కలిసి రావాలంటే రుద్రాక్షలు ధరిస్తే మంచి లాభాలుంటాయి. అందులో పది ముఖాలు, పదమూడు ముఖాలు, పద్నాలుగు ముఖాలు కలిగిన రుద్రాక్షలు ధరిస్తే విజయాలు దక్కుతాయి. వైద్య రంగంలో ఉండేవారికి త్రి ముఖి, నాలుగు ముఖాలు, 9 ముఖాలు, 10 ముఖాలు, 11 ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
న్యాయ నిపుణులు అయితే ఏకముఖి రుద్రాక్ష ధరించాలి. ఐదు ముఖాలు, పదమూడు ముఖాలు కలిగిన రుద్రాక్షలను ధరించడం వల్ల కూడా ప్రయోజనం కలుగుతుంది. రాజకీయ రంగంలో ఉన్నవారికి ఏకముఖి, 13 ముఖాలు, 14 ముఖాలు ఉన్న రుద్రాక్షలు ధరిస్తే మంచిది. ఇంజినీరింగ్ రంగంలో ఉన్న వారికి 9 ముఖాలు లేదా 12 ముఖాలు కలిగిన రుద్రాక్షలు ధరించడం వల్ల అనుకూల ఫలితాలు ఉంటాయి.
హిందూ మతంలో రుద్రాక్షలను పవిత్రంగా భావిస్తారు. శివుడికి ప్రతిరూపంగా చూస్తారు. రుద్రాక్షలు శివుడి కన్నీళ్ల నుంచి పుట్టాయని నమ్ముతారు. రుద్రాక్షను మెడ, చేతికి ధరించడానికి కారణాలు ఇవే. శ్రావణమాసంలో రుద్రాక్షలను ధరించడం వల్ల పుణ్యం లభిస్తుందని చెబుతారు. శివుడి అనుగ్రహం శాశ్వతంగా ఉండాలంటే రుద్రాక్షలను ధరించాలి. మనం చేసే పనుల్లో రుద్రాక్ష ధరిస్తే ఐశ్వర్యం సొంతం అవుతుంది.