
Weather Report : రానున్న మూడు రోజుల్లో రాష్ట్రంలో పగటి ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఉష్ణోగ్రతలు రెండు నుంచి మూడు డిగ్రీల వరకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు.మరోవైపు, రాష్ట్రంలోని పలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది. మంచిర్యాల, ములుగు, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, భూపాలపల్లి, జనగాం, సిద్ధిపేట, భువనగిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.