
Wedding with a treeఅప్ కమింగ్ యంగ్ డైరెక్టర్స్ కథ, కథనం విషయంలో చాలా వైవిద్యం చూపుతున్నారు. ఇటీవల విడుదలైన విరూపాక్షను తీసుకుంటే ఆ సినిమాకు కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహించాడు. సాధారణ జానర్ లోనే సాగిన సూపర్ ట్విస్ట్ లతో సినిమా ఆకట్టుకుంది. ఇలాంటి కథలనే ఫ్యామిలీ డ్రామాలుగా తీసుకువస్తున్నారు అప్ కమింగ్ డైరెక్టర్స్. ఇప్పుడు మనం చెప్పుకునే సినిమా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ ఈ మూవీకి పూరి జగన్నాథ్ శిష్యుడు డాక్టర్ ఏఆర్ శ్రీధర్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా చాలా వైవిధ్యంగా ఉంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
సీనియర్ నటుడు బ్రహ్మాజీ కుమారుడు సంజయ్ రావు, బాలనటి నుంచి ఫస్ట్ మూవీతో హీరోయిన్ గా మారుతున్న ప్రణవి మానుకొండ జంటగా ‘స్లమ్ డాగ్ హస్బెండ్’ సినిమా తెరకెక్కుతుంది. రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రం ‘మైక్ మూవీస్’ బ్యానర్ పై వస్తుంది. ఈ మూవీలో బ్రహ్మాజీ, సప్తగిరిలు కూడా లీడ్ రోల్ చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా రిలీజ్ డేట్ (జూలై 21) అనౌన్స్ చేశారు మేకర్స్. దీనికి సంబంధించి రిలీజ్ పోస్టర్ ను హీరో సత్యదేవ్ ఆవిష్కరించారు.
ఈ సినిమా గురించి బ్రహ్మాజీ మాట్లాడుతూ ‘నా కొడుకు హీరోగా ఎదిగినందుకు సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకునేది చాలానే ఉంది. ఇందులో ఒక పాత్ర కోసం చిత్ర యూనిట్ నన్ను అప్రోచ్ అయ్యింది. నేను ఒకే చెప్పాను, ఆ తర్వాత మా అబ్బాయిని చూసి హీరోగా తీసుకున్నారు. ఇండస్ట్రీ విషయంలో మా అబ్బాయికి ఎలాంటి సలహాలు, సూచనలు ఇవ్వను. నేను ఎలా నేర్చుకున్ననో వాడు అలాగే నేర్చుకోవాలి. వాడి మొదటి మూవీ ప్రమోషన్ కు
చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు రావడం ఆనందంగా ఉంది.
డైరెక్టర్ మాట్లాడుతూ.. హీరోయిన్ పాత్ర కోసం చాలా మందిపై ఆడిషన్స్ చేశాం. పక్కింటి అమ్మాయిలా ప్రణవి బాగుంటుందని ఫైనల్ చేశాం. ఇందులో ఎలాంటి అసభ్య సన్నివేశాలు లేవు. కుటుంబ సమేతంగా చూడవచ్చు. కుక్కకు మెయిల్ వాయిస్ పెట్టాం. కానీ అందులోనూ ఓ ట్విస్ట్ ఉండేలా చూసుకున్నాం. పూరి దగ్గర నేను అసిస్టెంట్‌గా పని చేశా. ‘మనుషులకంటే జంతువులే విధేయంగా ఉంటాయి.’ అంటూ పూరీ సార్ ఈ మధ్య ఒక మ్యూజింగ్స్ లో చెప్పాడు. దాన్ని చుట్టూనే కథ అల్లుకున్నా. అందులో భాగంగానే వచ్చింది ఈ సినిమా.






