Friend wife : స్నేహితుడంటే మన హితం కోరే వాడే కానీ మన నాశనం కోరుకునే వాడు మాత్రం కాదు. స్నేహం పేరుతో ఇంటికి వస్తూ అతడి పెళ్లాన్నే లేపుకుపోయిన సంఘటన సంచలనం కలిగించింది. నమ్మినందుకు నయవంచన చేశాడు. ఆపదలో తోడుండాల్సిన వాడే ఆపద తీసుకొచ్చాడు. మిత్రుడి భార్యను తన సుఖం కోసం తీసుకెళ్లిన ఘటన ఆశ్చర్యం కలిగించింది.
కిరణ్ (32), అక్షయ్ (31) స్నేహితులు. వీరు బాగల్ గుంటేలో ఉంటున్నారు. వీరు సెకండ్ హ్యాండ్ కార్లు, బైక్ లు అమ్మే వ్యాపారం చేసుకుంటున్నారు. వీరికి బెంగుళూరు కేంగేరికి చెందిన హేమంత్, కిరణ్ స్నేహితులుగా ఉండేవారు. వీరు బార్ అండ్ రెస్టారెంట్ లో పని చేసేవారు. వీరికి మరిస్వామి అనే వెయిటర్ కూడా తోడయ్యాడు. వీరంతా కిరణ్ ను కలవడానికి హేమంత్ బాగలకుంటేకి వచ్చేవారు. హేమంత్ వెంట మరిస్వామి కిరణ్ దగ్గరకు వచ్చేవారు.
దీంతో మరిస్వామి కన్ను కిరణ్ భార్య హేమ మీద పడింది. ఇంకేముంది ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. దీంతో వారి మధ్య విరహాగ్ని పెరగడంతో మరిస్వామి హేమను లేపుకుపోయాడు. విషయం తెలుసుకున్న కిరణ్ తన భార్య లేచిపోవడానికి కారకుడైన హేమంత్ ను అంతమొందించాలని పథకం పన్నాడు. దానికి అక్షయ్ సాయం తీసుకున్నాడు.
ఫిబ్రవరి 4న రాత్రి 7 గంటలకు కేంగేరికి వెళ్లిన కిరణ్, అక్షయ్ అతడి ఫ్రెండ్ హేమంత్ కు ఫోన్ చేసి పిలిపించారు. బార్ లో బాగా తాగించి తరువాత పాపన్న లే అవుట్ కు తీసుకెళ్లి హేమంత్ ను కర్రలు, రాడ్లతో కొట్టి చంపి పరారయ్యారు. గాయపడిన హేమంత్ ను ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. దీంతో కిరణ్, అక్షయ్ లను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు.