
Singer Sunita Son : సింగర్ సునీత కుమారుడు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. దీని పేరు సర్కారు నౌకరి అని పెట్టారు. దీనికి ఆర్కే సంస్థ నిర్మాణంలో జరుగుతోంది. దీంతో సినిమాపై అందరికి అంచనాలు పెరిగాయి. దీనికి గంగనమోని శేఖర్ దర్శకత్వం వహించనున్నాడు. ఎన్నో అద్భుతమైన చిత్రాలు నిర్మించిన సంస్థగా పేరుంది. దీంతో సునీత కుమారుడిని హీరోగా పరిచయం చేయడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొంది.
ఇటీవల 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకలకు హాజరైన సునీత మాట్లాడుతూ నాకు నంది అవార్డు వచ్చినప్పుడు కూడా ఇంత సంతోషం పొందలేదని ఎమోషనల్ అయింది. రాఘవేంద్ర రావు లాంటి వారు నా కుమారుడిని హీరోగా పరిచయం చేయడం సంతోషంగా ఉందని కన్నీరు పెట్టుకుంది.
సినిమా కథ విషయానికి వస్తే ఈ సినిమాలో హీరో పల్లెటూర్లో కండోమ్స్ అందుబాటులో ఉంచే ఉద్యోగిగా నటిస్తున్నాడు. ఆకాష్ కు సరిపోయే విధంగా కథలో మార్పులు చేర్పులు చేశారు. ఈ సినిమాతో ఆకాష్ భవితవ్యం మారుతుందన్నారు. కండోమ్స్ ఇచ్చే క్రమంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నాడనేదే ప్రధానంగా ఉంటుంది. సినిమాలో మంచి సందేశం ఉంటుందంటున్నారు.
ఆకాష్ కు జంటగా భావనా వళవండల్ నటిస్తోంది. రాఘవేంద్ర రావు సినిమాలో పాటలు ఆకట్టుకుంటాయి. అందుకే ఈ సినిమాలో పూర్తిస్థాయి వినోదాత్మకంగా నిర్మాణం చేయనున్నారు. ఆకాష్ కు మంచి బ్రేక్ ఇచ్చే సినిమాగా రూపొందించనున్నారు. దీంతో సర్కారు నౌకరి సినిమా నిర్మాణంతో ఇటు ఆర్కే ఫిలింస్ కు అటు ఆకాష్ కు మంచి పేరు తెచ్చే సినిమాగా తీయనున్నారని తెలుస్తోంది.