39.6 C
India
Friday, May 8, 2026
More

    Mahesh Babu : ఏంటీ సినిమా.. కల్కి చూసి సంచలన కామెంట్స్ చేసిన మహేష్ బాబు..

    Date:

    Mahesh Babu
    Mahesh Babu

    Mahesh Babu : ప్రభాస్-నాగ్ అశ్విన్ కాంబోలో తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’పై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. స్పెషల్ షో నుంచి సినీ, రాజకీయ ప్రముఖులు మేకర్స్ ను అభినందిస్తూనే ఉన్నారు. ఎక్స్, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు వారి అభిప్రాయం తెలుపగా.. తాజాగా స్టార్‌ హీరో మహేశ్‌ బాబు ‘ఎక్స్’లో టీమ్‌కు శుభాకాంక్షలు చెప్పారు. తనదైన శైలిలో రివ్యూ ఇచ్చారు.

    ‘కల్కి ఓ అద్భుతం.. జస్ట్‌ వావ్‌.. నాగ్‌ అశ్విన్‌ విజన్‌కు హ్యాట్సాఫ్‌. ప్రతీ ఫ్రేమ్‌ కళాఖండమే. అమితాబ్‌ స్క్రీన్‌ ప్రజెన్స్‌కు ఎవరూ సరితూగరు. కమల్‌ హాసన్‌ ప్రతీ పాత్రకు జీవం పోస్తారు. ప్రభాస్‌ నటన అత్యంత అద్భుతం. దీపిక పదుకొణె అద్భుతంగా కనిపించారు. ఇంతటి భారీ ప్రాజెక్టును తెరకెక్కించి విజయాన్ని సొంతం చేసుకున్న వైజయంతీ మూవీస్‌కు అభినందనలు’ అని రాశారు. ఈ పోస్ట్‌పై దర్శకుడు స్పందిస్తూ.. ధన్యవాదాలు చెప్పారు. ‘మీ అభినందనలు అందుకోవడం టీమ్‌కు ఆనందంగా ఉంది.’ అని రిప్లై ఇచ్చారు. నిర్మాణ సంస్థ కూడా మహేశ్‌కు ధన్యవాదాలు చెప్పింది.

    బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో ‘కల్కి’ చూడనున్న అశ్విన్‌..
    ‘కల్కి 2898 ఏడీ’ రిలీజ్ కు ముందు నుంచే యూఎస్ఏలో ప్రభంజనం సృష్టిస్తోన్న సంగతి తెలిసిందే. అక్కడి ప్రేక్షకులకు కూడా ధన్యవాదాలు చెప్పిన డైరెక్టర్ నాగ్‌ అశ్విన్‌ వారితో కలిసి ఈ సినిమాను వీక్షించనున్నారు. అమెరికాలోని బిగ్గెస్ట్‌ ఐమాక్స్‌లో శనివారం (జులై 13) మధ్యాహ్నం ఆడియన్స్‌తో కలిసి కల్కి చూడాలని అనుకుంటున్నారట. ఈ విషయాన్ని  నిర్మాణ సంస్థ పోస్టర్‌ ద్వారా విడుదల చేసింది.

    కల్కి వసూళ్ల వర్షం కొనసాగుతూనే ఉంది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో రూ.900 కోట్లకు (గ్రాస్‌) పైగా వసూలు చేసినట్లు బృందం ప్రకటించింది. ఇప్పటికీ హౌస్‌ఫుల్ బోర్డులు కనిపిస్తూనే ఉన్నాయి. దీంతో త్వరలోనే ఈ చిత్రం రూ.1000 కోట్లు క్లబ్ లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి. అగ్ర నటులు అమితాబ్‌ బచ్చన్‌.. అశ్వత్థామగా, కమల్‌ హాసన్‌ సుప్రీం యాస్కిన్‌గా ఆకట్టుకున్నారు. విజయ్‌ దేవరకొండ, దుల్కర్‌ సల్మాన్‌ గెస్ట్ రోల్ లో అలరించారు. బౌంటీ ఫైటర్‌ భైరవగా సందడి చేసిన ప్రభాస్‌.. చివరిలో కర్ణుడిగా కనిపించి సీక్వెల్ పై అంచనాలు పెంచేశారు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Mahesh Babu : మహేష్ బాబు కంటే ముందే రాజమౌళి మరొక హీరోతో సినిమా చేయాల్సిందా..? ఇంతకీ ఆ హీరో ఎవరంటే..?

    Mahesh Babu : దర్శక ధీరుడు రాజమౌళి తన తదుపరి పాన్ వరల్డ్...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి సినిమాలో ఉన్న ట్విస్ట్ ఇదేనా..?

    Mahesh Babu : మహేష్ బాబు - రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా...

    Mahesh Babu : మహేష్ బాబు రాజమౌళి కి మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చాయా..?

    Mahesh Babu : ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన...

    Mahesh Babu : మహేష్ బాబు కి ఈడీ అధికారుల ఆదేశం..నేడు విచారణకు వస్తాడా?

    Mahesh Babu : మహేష్ బాబు సాయి సూర్య డెవలపర్స్, సురానా గ్రూప్స్...