Megastar Comedy : మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరో అయినా, అంతకు మించి కామెడీ కూడా పండించగలడు. చిరు కామెడీ టైమింగ్ సూపర్ గా ఉంటుంది. జేబు దొంగ, దొంగ మొగుడు, యుముడికి మొగుడు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, గ్యాంగ్ లీడర్ చిత్రాలు యాక్షన్ చిత్రాలైనా అందులో చిరంజీవి చేసిన కామెడీ మామూలుగా ఉండదు. ఆ సినిమాలు సూపర్ హిట్లుగా నిలవడంతో పాటు కాసుల వర్షం కురిపించాయి.
ఇటీవలి కాలంలో ఏదైనా సినిమా ఈవెంట్లకు వెళ్లినా, ఇంటర్వ్యూలు ఇచ్చినా హుందాగా వ్యవహరిస్తూనే తన దైన కామెడీతో మరింత ఆకట్టుకుంటున్నాడు. గతేడాది ఓ ఫంక్షన్ కు అతిథిగా వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి తన పెళ్లి నాటి ముచ్చట్లను గుర్తుచేసుకొని అక్కడ నవ్వులు పూయించాడు. చాలా రోజుల తర్వాత ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ను డైరెక్టర్ బాబీ కొంత ఉపయోగించుకున్నాడు. మెగాస్టార్ లోని ఒకప్పటి కామెడీని మళ్లీ చూడాలని ఎంతో మంది అభిమానులు ఇప్పటికీ కోరుకుంటున్నారు. కానీ అప్పటి కామెడీని ఇప్పటి దర్శకులు చూపించలేకపోతుండడం నిజంగా చిరంజీవికి వెలితే.
హీరో సత్యదేవ్ నటించిన ‘జీబ్రా’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి సందడి చేశాడు. ఈ ఈవెంట్ లో చిరంజీవి చేసిన కామెడీ గురి తప్పలేదు. చిరంజీవి డైలాగులకు ఆడిటోరియం దద్దరిల్లిపోయింది. కొన్ని క్లిప్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి. ఈవెంట్ లో చిరంజీవి మాట్లాడుతుండగా ఓ అభిమాని ‘బాసూ..నిన్ను చూసేందుకు నేను వైజాగ్ నుంచి వచ్చానంటూ పెద్దగా అరిచాడు. ఇక మైక్ అందుకున్న చిరంజీవి అక్కడి యాసలో మాట్లాడుతూ హుషారు తెప్పించాడు.
సత్యదేవ్ నటిస్తున్న జీబ్రా చిత్రం ఈ నెల 22న గ్రాండ్ గా విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్,ట్రైలర్ ఆకట్టుకుంటున్నది. సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.
Megastar #Chiranjeevi‘s spontaneous timing @ #Zebra Pre Release Event❤️❤️❤️❤️@KChiruTweets pic.twitter.com/99uKZ6J4Ci
— Vamsi Kaka (@vamsikaka) November 12, 2024