37.5 C
India
Friday, March 29, 2024
More

    Uttam Kumar Reddy: ఏంటయ్యా ఉత్తమ్.. సొంత పార్టీపైనే ఫిర్యాదా..?

    Date:

    Uttam Kumar Reddy
    Uttam Kumar Reddy

    Uttam Kumar Reddy : అన్ని పార్టీలకంటే కాంగ్రెస్ పార్టీ అన్నింట్లో డిఫరంట్ అనే చెప్పాలి. ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీ గురించి మిగతా పార్టీ్లోని నేతలు కాంగ్రెస్ ది పీతల పంచాయతీ అని చెప్తుంటారు. స్వాతంత్రం ముందు నుంచి ఉన్న వేళ్లూ పాతుకుపోయిన కాంగ్రెస్ లో ఇప్పటికీ వర్గపోరు, కుమ్ములాటలు కనిపిస్తూనే ఉంటాయి. క్రమశిక్షణ లేని పార్టీ అంటూ ఎప్పుడూ ఆరోపణలు వినిపిస్తూనే ఉంటాయి.

    మొన్నటికి మొన్న రేవంత్ రెడ్డి టీపీసీసీ బాధ్యతలు తీసుకుంటే జూనియర్ అంటూ కొంత మంది.. వేరే పార్టీల నుంచి వచ్చిన వ్యక్తికి ఇవ్వడం కరెక్ట్ కాదని మరికొందరు ఇలా పేచీలు పెట్టుకుంటూ పార్టీని అధోగతి పాలు చేశారు. తెలంగాణలో మంచి కేడర్ ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ మాత్రమే. అంత మంది కేడర్ ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ వైపు వెళ్లిపోయిందంటే అందుకు పీతల పంచాయతే అంటూ ఆరోపణలు ఉన్నాయి.

    ఇలీవల సొంత పార్టీ సోషల్ మీడియాపైనే ఉత్వమ్ కుమార్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మరికొందరు కోవర్టులుగా వ్యవహరిస్తున్నారని సోషల్ మీడియాలో కొంత కాలంగా వైరల్ అవుతుంది. అయితే ఇదంతా రేవంత్ రెడ్డి పనే అంటూ సీనియర్లు అనుమానాలు వ్యక్తం చేశారు. దీనికి తోడు ఉత్తం మరో అడుగుముందుకేసి మూడు నెలలపై సొంత పార్టీ పైనే పోలీసులకు ఫిర్యాదు కూడా చేశాడు.

    బంజారాహిల్స్ లోని ఓ ఫ్లాట్ అద్దెకు తీసుకొని కాంగ్రెస్ సోషల్ మీడియా వింగ్ ఉత్సాహంగా పని చేస్తుంది. బీఆర్ఎస్ వ్యతిరేఖతపై పోస్టర్లు తయారు చేయడం, కార్టూన్లు రూపొందించడం ఇక్కడి వార్ రూమ్ లో నిత్యం జరుగుతూ ఉంటుంది. అయితే రీసెంట్ గా దీనిపై పోలీసులుదాడి చేశారు. ల్యాప్ టాప్ లు ఎత్తుకెళ్లారు. ఇదేంటని ప్రశ్నిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫిర్యాదుతోనే దాడి చేసినట్లు పోలీసులు చెప్తున్నారు.

    గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ వార్ రూమ్ పై, అది కూడా కాంగ్రెస్ వ్యూహకర్త సునీల్ కనుగోలు ఏర్పాటు చేసిన ఆఫీసులో దాడులు చేసి కంప్యూటర్లు ఎత్తుకెళ్లారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు కాబట్టే అంటూ పోలీసుల చెప్పారు. ఆ సమయంలోనే ఉతం, కోమటిరెడ్డికి వ్యతిరేకంగా కూడా పోస్టులు రూపొందిస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా కాంగ్రెస్ సోషల్ మీడియాను ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇరికించారని తెలుస్తోంది.

    Share post:

    More like this
    Related

    March 31 : మార్చి 31 లోపు మీరు చేయాల్సిన పనులు ఇవే..

    March 31 : మ్యూచువల్ ఫండ్స్  లో మదు పు చేస్తున్నవారు...

    YCP Road Show : వైసిపి రోడ్ షో.. తెలుగుదేశం పార్టీ సెటైర్..

    YCP Road Show : వైసీపీ రోడ్ షో కు జనం...

    Weather Report : ఈ ఐదు రోజులు జాగ్రత్తగా ఉండాలి: వాతావరణ శాఖ

    Weather Report : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలో నీటి...

    Undavalli : ఉండవల్లిలో టీడీపీ  పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు..

    Undavalli News : ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో తెలుగుదేశం పార్టీ 42వ...

    POLLS

    ప్రతిపక్షాలను ఇబ్బంది పెట్టటానికే 2000 రూపాయల నోటు రద్దు చేశారని మీరు భావిస్తున్నారా..?

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Congress : ఈనెల 30న కాంగ్రెస్ లోకి కేకే, విజయలక్ష్మి? 

    Congress : బీఆర్ఎస్ సీనియర్ నేత కే.కేశవరావు కాంగ్రెస్ పార్టీలో చేరే...

    MLA Resignation : భార్యకు టికెట్ ఇవ్వలేదని ఎమ్మెల్యే రాజీనామా..

    MLA Resignation : అస్సాంలో కాంగ్రెస్ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ...

    Hanumantha Rao : సీఎం రేవంత్ రెడ్డి పై అసహనం వ్యక్తం చేసిన హనుమంత రావు..? 

    Hanumantha Rao : తెలంగాణ: కాంగ్రెస్ లో BRS నేతల చేరికపై ఆ...

    Congress : కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల పేర్లను ప్రకటించిన  కాంగ్రెస్ పార్టీ..

    Congress : లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబి...