past birth మనిషికి పునర్జన్మ ఉంటుందని కొందరు నమ్ముతుంటారు. మరికొందరు మాత్రం ఉండదంటారు. ఇందులో ఏది నిజమో మనకు తెలియదు. భగవద్గీతలో ఓ శ్లోకం ఉంటుంది. మరణించిన వాడికి జన్మం తప్పదు. జన్మించిన వాడికి మరణం తప్పదు. కన్ను మూస్తే మరణం. కన్ను తెరిస్తే జననం. ఈ లిప్తపాటులో జరిగేదే జీవితం. మనిషి మరణించాక ఆత్మ మరో శరీరంలోకి ప్రవేశించి జన్మిస్తుందని అంటారు.
ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు కొత్తగా ఫీల్ అవడమో లేదా వాయిస్ విన్నప్పుడు లేదా సంగీతం విన్నప్పుడు కొత్త ప్రదేశాన్ని చూసినప్పుడు మనసులో ఏదో తెలియని ఫీలింగ్ కలిగితే దాన్ని డెజావు అంటారు. ఆ భావన కలిగితే గత జన్మ ఉందని అనుకోవచ్చు. కొంతమంది పిల్లలకు విచిత్రమైన జ్ణాపకాలు వస్తాయి. రాత్రిపూట వచ్చే కలలుగా అనుకుంటారు. అవి వారి జన్మకు సంబంధించిన గుర్తులు.
మనకు వచ్చే సోషియో ఫాంటసీ కలలు గత జన్మవి వస్తాయట. నీళ్లు, పక్షులు, నంబర్లు తదితర వాటిని చూసి భయపడుతుంటారు. గత జన్మలో వాటి వల్ల మరణం సంభవించిందేమో అనుకుంటారు. ఈ జన్మలో చేసిన తప్పులకు వచ్చే జన్మలో శిక్షలు పడతాయని నమ్ముతారు. వివాహేతర సంబంధాలు పెట్టుకునే వారికి తేడేలు, రాబందు, పాము, కొంగగా జన్మిస్తారట.
పెద్దలను గౌరవించని వారు కాకిగా పుట్టి పదేళ్లు గడుపుతారట. బంగారం దొంగిలించే వారు కీటకంగా పుడతారట. వెండి దొంగతనం చేస్తే పావురంగా పుడతారట. ఇతరుల వస్తువులు దొంగతనం చేసిన వారు చిలకగా పుడతారట. ఇతరులను చంపేవారు గాడిదగా జన్మిస్తారట. ఇలా మనం చేసే తప్పుల వల్ల ఇలా వచ్చే జన్మలో పుడతారని చెబుతున్నారు.