37.8 C
India
Friday, May 15, 2026
More

    Bollywood : ఒకప్పుడు బాలీవుడ్ ను ఏలిన ఖాన్ లు ఇప్పుడు ఏం చేస్తున్నారు? వీరిలో ఎవరు ముందున్నారు..

    Date:

    Bollywood
    Bollywood

    Bollywood : ఒకప్పుడు బాలీవుడ్ అంటేనే గుర్తుకు వచ్చే హీరోలు అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్. వాళ్ల కంటూ ప్రత్యేక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నారు. దాదాపుగా వారంతా సమకాలంలో (ఒకటి రెండు సంవత్సరాలు అటూ ఇటుగా) నే ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. అప్పటి నుంచి ఖాన్ త్రయం ఏక ఛత్రాదిపత్యంగా ఎదుగుతూ ఏలుతూ వస్తోంది. ఇక బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి హిట్ సినిమా రావాలంటే అది ఈ ముగ్గురి నుంచి రావాలి తప్ప మరో హీరో నుంచి వచ్చే అవకాశం లేదు. ఇలాంటి క్రమంలో ఈ ముగ్గురి హవా భారీగా తగ్గిందనే చెప్పవచ్చు.

    ప్రస్తుతం అమీర్ ఖాన్ ‘లాల్ సింగ్ చద్దా’ తర్వాత మరొక సినిమాని అనౌన్స్ చేయలేదు. సల్మాన్ ఖాన్ తమిళ దర్శకుడు మురుగదాస్ డైరెక్షన్ లో ఒక సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు. షారుఖ్ ఖాన్ కూడా కొన్ని సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఇలాంటి క్రమంలో షారుక్ రెండు సినిమాలైన పఠాన్, జవాన్ తో మంచి విజయాలను అందుకున్నాడు. కానీ రాజ్ కుమార్ హిరానీ డైరెక్షన్ లో వచ్చిన ‘డుంకీ’తో భారీ ప్లాప్ ను చవిచూశాడు.

    సల్మాన్ ఖాన్ మాత్రం ఈ మధ్యకాలంలో ఒక్క హిట్టు కూడా ఇవ్వలేకపోయాడు. షారుక్ ఖాన్ తో పోలిస్తే సల్మాన్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని చెప్పాలి. తనకు సరైన సక్సెస్ పడి కొన్నేళ్లవుతుంది. మరి ఈ క్రమంలో ఆయన తమిళ డైరెక్టర్ మురుగదాస్ తో చేస్తున్న సినిమా సక్సెస్ అవుతుందా? లేదా? అన్న అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతున్నాయి.

    ఈ మూవీ తర్వాత అట్లీ డైరెక్షన్ లో మరొక మల్టీ స్టారర్ సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నాడు. అట్లీతో జవాన్ రూపంలో షారుక్ కు ఒక సక్సెస్ దక్కింది. తనకు కూడా సక్సెస్ అందిస్తాడనే కాన్ఫిడెంట్ తో సల్మాన్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఖాన్ త్రయం లో షారుఖ్ ముందు వరుసలో ఉన్నాడు.

    Share post:

    More like this
    Related

    Tirumala : తిరుమలలో భక్తుల రద్దీ.. వారం రోజుల్లో రూ. 25.53 కోట్ల ఆదాయం

    Tirumala : వేసవి సెలవులు, అనుకూల వాతావరణంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది....

    Balakrishna : బాలకృష్ణకు ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డు

    Balakrishna : తెలంగాణ ప్రభుత్వం అందించనున్న గద్దర్‌ ఫిల్మ్‌ అవార్డుల వివరాలను సినీ...

    Sunny Yadav : బయ్యా సన్నీయాదవ్ పాకిస్తాన్ లో ఏం చేశాడు?

    Sunny Yadav : తెలుగు ట్రావెల్ యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్‌ను జాతీయ...

    Chandrababu : చంద్రబాబు సంచలన నిర్ణయం.. ఏం చేయబోతున్నారు?

    Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుతం గగ్గోలు రేగుతోంది. టీడీపీ అధినేత నారా...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Salman Khan : సల్మాన్ ఖాన్ రెమ్యూనరేషన్ 150 కోట్లు..కానీ ‘సికిందర్’ వసూళ్లు ఎంతంటే!

    Salman Khan : AR మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన సికిందర్ చిత్రం, సల్మాన్...

    Spirit : స్పిరిట్’ షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనా?

    Spirit : సందీప్ రెడ్డి వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ ఈ ఏడాది...

    Monalisa : హీరోయిన్ గా మోనాలిసా.. హీరో ఎవరో తెలుసా?

    Monalisa :  తంతే బూరల బుట్టలో పడ్డట్టు అయ్యింది మోనాలిసా.. ఈ...

    Salman Khan : సల్మాన్ ఖాన్ కంటే కార్తీక్ ఆర్యన్ ముందున్నాడా..?

    Salman Khan : భూల్ భులైయా 3, సింగం ఎగైన్ అనే...