
Sun stoke solutions : వేసవికాలంలో వేడి దహిస్తుంది. ఎండలు మెండుగా ఉన్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీంతో తెలుగు రాష్ట్రాలు కుతకుతలాడుతున్నాయి. వడదెబ్బకు పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. ఎండల దాటికి జనం బయటకు రావడం లేదు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు రోడ్లన్ని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దీంతో భానుడి భగభగలకు జనం బెంబేలెత్తిపోతున్నారు. వేసవిలో వడదెబ్బ తాకితే ప్రాణాలే పోతాయి. వడదెబ్బ నుంచి తట్టుకునే ద్రావణాలు ఉన్నాయి.
కొబ్బరినీళ్లు భలే రుచిగా ఉంటాయి. తాగుతుంటే తియ్యగా ఉంటాయి. దీంతో రోజు తాగినా మంచిదే. రోజు తాగుతుంటే వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో పోషకాలు మెండుగా ఉంటాయి. సోడియం, పొటాషియం, లవణాలు అధికంగా ఉండటంతో ఎండ వల్ల కోల్పోయిన శక్తిని తిరిగి తీసుకొస్తుంది. కేలరీలు, పిండి పదార్థాలు, కొవ్వు తక్కువగా ఉండటతో శరీరానికి తక్షణ శక్తి ఇస్తుంది.
మజ్జిగ కూడా మన శరీరాన్ని డీ హైడ్రేడ్ కాకుండా చూస్తుంది. ఇందులోని కాల్షియం, విటమిన్ బి శరీరంలోని శక్తులను కోల్పోనివ్వదు. ఇందులో కాస్త ఉప్పు, చిటికెడు వాము, చిన్న అల్లం ముక్క, రెండు నిమ్మ ఆకులు వేసుకుని తాగితే ఎంతో రుచిగా ఉంటుంది. వడదెబ్బ సోకకుండా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది.
ఎండాకాలంలో చెరుకురసం కూడా బాగా పనిచేస్తుంది. ఇందులో ఎలక్టోలైట్లు, మెగ్నిషియం, కాల్షియం శరీరానికి శక్తినిస్తాయి. వడదెబ్బ బారి నుంచి రక్షించడానికి ఇది కూడా ఉపయోగపడుతుంది. మూత్ర సంబంధ సమస్యలకు చెక్ పెడుతుంది. వేసవిలో శరీరం చల్లబడటానికి సబ్జా గింజలు ఉపయోగపడతాయి. నీళ్లలో వీటిని వేసుకుని తాగడం వల్ల పోషకాలు అందుతాయి. దీని వల్ల కూడా వడదెబ్బ సోకే ప్రమాదం ఉండదు.