
Brain tumor : ఈ రోజుల్లో బ్రెయిన్ ట్యూమర్ సాధారణంగా మారుతోంది. బ్రెయిన్ ట్యూమర్ సమస్య రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బ్రెయిన్ ముప్పు తొలగించుకోవడానికి కొన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందే. మన శరీరంలో కణాలు చనిపోతుంటాయి. వాటి స్థానంలో కొత్తవి పుడుతుంటాయి. ఇలా కొన్ని కణాలు కలిసి పోగవుతాయి. ఇలా పోగయిన కణాలు చనిపోకపోయినా కొత్తవి పుట్టుకొస్తాయి. ఇవన్ని పోగుపడి పోతాయి. వీటితోనే బ్రెయిన్ ట్యూమర్ గా మారుతుంది.
బ్రెయిన్ ట్యూమర్ ముప్పు తగ్గించుకోవడానికి పలు రకాల పద్ధతులు ఉన్నాయి. సెల్ ఫోన్ ఎక్కువగా వాడితే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశాలున్నాయి. ఫోన్ ద్వారా ఉత్పత్తి అయ్యే వేడి, రేడియేషన్ కారణంగా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే వీలుంటుంది. దీంతో మనకు బ్రెయిన్ ట్యూమర్ తో శారీరక వ్యవస్థ దెబ్బ తింటుంది. అందుకే బ్రెయిన్ ట్యూమర్ రాకుండా చూసుకోవడానికి ప్రయత్నించాలి.
కెమికల్ ఫ్యాక్టరీలలో పని చేసే వారికి కూడా బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంటుంది. రసాయనాలు, పురుగు మందుల ద్రావణాలతో బ్రెయిన్ ట్యూమర్ వచ్చే అవకాశముంటుంది. దీంతో వీటికి దూరంగా ఉండటమే మంచిది. పారిశ్రామిక ప్రాంతాలకు సమీపంలో నివసించే వారికి ఈ ముప్పు పొంచి ఉంటుంది. అందుకే వీరు జాగ్రత్తగా ఉండటం అవసరం.
తాజా పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకుంటే బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ముప్పు ఉండదు. తగినంత శారీరక శ్రమ లేకపోతే ఈ ముప్పు ఏర్పడుతుంది. ధూమపానం, మద్యపానం చేసే వారిలో ఇది వచ్చేందుకు అవకాశాలెక్కువ. మంచి ఆహార అలవాట్లు లేకపోతే కూడా వస్తుంది. ఇలా మన దినచర్య బాగుంటే ఇలాంటి వ్యాధి రాకుండా చేసుకోవచ్చు.