
Kidney Disease : మన శరీరంలో నిరంతరం పనిచేసే భాగాలున్నాయి. అవి మనం పడుకున్న వాటి పని అవి చేస్తుంటాయి. అవే కాలేయం, కిడ్నీలు, గుండె, మెదడు. ఇలా ఇవి మన శరీరంలో ముఖ్యమైన భాగాలు. ఇందులో కిడ్నీలు ఇంకా ప్రధానమైనవి. వీటిని సురక్షితంగా ఉంచుకుంటే మనకు జీవితాంతం సేవ చేస్తాయి. వాటికి అడ్డంకులు కల్పిస్తే చేతులెత్తేస్తాయి. ఫలితంగా మనం ఇబ్బందులు పడాల్సి వస్తుంది.
కిడ్నీలు పనిచేయకుండా పోతే డయాలసిస్ చేసుకోవాల్సి ఉంటుంది. కిడ్నీల పనితీరు బాగా లేకపోతే సమస్యలు వస్తాయి. కిడ్నీ వ్యాధితో బాధపడేవారు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. మద్యానికి దూరంగా ఉండాలి. మాంసాహారం తీసుకోకూడదు. రాత్రి వేళ పండ్లు మాత్రమే తీసుకుంటే మంచిది. త్వరగా జీర్ణమయ్యే ఆహారం తీసుకుంటే కిడ్నీలపై ఒత్తిడి పడదు.
పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, ప్రొటీన్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. కొవ్వులేని పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. నిమ్మరసం, కీర దోసకాయ తీసుకోవాలి. దీంతో శరీరం డీటాక్స్ అవుతుంది. కిడ్నీల పనితీరు మెరుగుపడుతుంది. కిడ్నీల ఆరోగ్యంపై డ్రై ఫ్రూట్స్ మంచి ఫలితాలు ఇస్తాయి. ఇలా కిడ్నీల జబ్బు ఉన్న వారు మంచి ఆహారాలు తీసుకుంటే ప్రయోజనం.