Water Challenge: మనిషికి వేపకాయంత వెర్రి ఉంటుందట. దాంతో ఏం చేస్తారో వారికే తెలియదు. అన్ని వింత రకాల ఆలోచనలు చేస్తుంటారు. మనిషి మనుగడకు ఆహారం ముఖ్యమే. ఆహారం తీసుకోకుండా జీవించడం కష్టం. కానీ ఓ సంస్థ ఆహారం తీసుకోకుండా 75 రోజులు బతకగలరా అనే ఓ చాలెంజ్ ను తీసుకొచ్చింది. దీనికి ఓ యువతి ఓకే చెప్పింది. దీంతో ఆమె రోజు ఆహారం తీసుకోకుండా కేవలం మంచినీళ్లు మాత్రమే తాగి ఉండాలనే షరతు మీద వచ్చింది. కానీ అన్ని రోజులు ఉండలేక ఆస్పత్రి పాలైంది.
ఆన్ లైన్ లో నిర్వహించే 75 HARD చాలెంజ్ లో పాల్గొన్న యువతి మిచెల్ ఫెయిర్ బర్న్ (కెనడా) ఆస్పత్రి పాలు కావడం చర్చనీయాంశంగా మారింది. ఈ చాలెంజ్ లో ఆమె 75 రోజులు మంచినీళ్లు మాత్రమే తాగాలి. రోజు 45 నిమిషాలు ఏదైనా పనిచేయాలి. ఏదైనా పుస్తకం పది పేజీలు చదవాలి. ఈ చాలెంజ్ కు ఆమె ఒప్పుకుంది.
వారు సూచించిన విధంగా మిచెల్ రోజు 4 లీటర్లు నీళ్లు తాగుతూ వచ్చింది. అయితే 12వ రోజుకు ఆమె ఆరోగ్యం మందగించింది. దీంతో ఇక ఆరోగ్యం సహకరించక ఆస్పత్రిలో చేరింది. కానీ ఈ చాలెంజ్ ను మళ్లీ కొనసాగిస్తానని చెప్పడం గమనార్హం. ఆమె ప్రాణాల మీదకు వచ్చినా అలా చెప్పడంపై అందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు పోయేలా ఉన్నా చాలెంజ్ కొనసాగిస్తానని ప్రకటించడంపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇలాంటి చాలెంజ్ లు పెడితే మనుషుల ప్రాణాలు ఉంటాయా? మనుషులను తిండి లేకుండా చేయడం అంటే చావుకు దగ్గర చేయడమే. పనికి మాలిన షరతులు పెడుతూ మనుషుల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నారు. ఈ సంస్థ చేసిన నిర్వాకం అందరిలో అయోమయం కలిగిస్తోంది. ఇలా నీళ్లు మాత్రమే తాగి ఉండాలంటే సాధ్యం కాదు. చివరకు ప్రాణాలే పోతాయి.