
ఎండాకాలంలో అందరు చల్లని వాటి కోసం ఆరాటపడతారు. చల్లని పదార్థాలే తీసుకుంటూ ఉంటారు. దీంతో వేడిని తగ్గించుకోవచ్చని అనుకుంటారు కానీ వేడిని చల్లని పదార్థాలు తగ్గించవు. ఏదో మనసు కోరుకుంటుందని చల్లటివి తీసుకుంటారు. కానీ అవి మనకు వేడిని కలగజేస్తాయి. నోటికి చల్లగా ఉంటుందనే ఉద్దేశంతో వాటిని తీసుకుని సేద తీరాలని చూస్తారు.
అందరు ఫ్రిజ్ వాటర్ నే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఎండలో తిరిగి వచ్చి చల్లని నీరు తాగడం సురక్షితం కాదు. దీంతో ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఎండలో తిరిగి వచ్చాక ఫ్రిజ్ వాటర్ తాగడం వల్ల నెగెటివ్ ఎఫెక్ట్ వస్తుందని చెబుతున్నారు.
చల్లని నీరు తాగడం వల్ల అజీర్తి సమస్యలు వస్తాయి. రక్తనాళాలను ఇరుకుగా చేస్తాయి. దీని వల్ల మనకు జీర్ణ సమస్యలు ఇబ్బందులు పెడతాయి. అందుకే చల్లని నీరు కాకుండా మామూలు నీళ్లు తాగడమే మంచిది. ఒకవేళ తాగాల్సి వస్తే కుండలో నీరు తాగడం చాలా సురక్షితం.
ఫ్రిజ్ వాటర్ తాగితే శ్వాస సంబంధమైన సమస్యలు వస్తాయి. జలుబు, గొంతునొప్పి బాధిస్తాయి. గుండె జబ్బులు ఉన్న వారికి ఇబ్బందికరమే. అందుకే చల్లని నీళ్లు తాగేందుకు ముందుకు రావొద్దు. ఎండలో నుంచి వచ్చి చల్లని నీళ్ల తాగితే నరాలు చల్లబడతాయి. మెదడు ప్రభావితమై తలనొప్పికి దారి తీస్తుంది. ఇలా చల్లని వాటర్ తో ఇన్ని రకాల ఇబ్బందులు ఉండటంతో ఆ నీళ్ల తాగకపోవడమే మంచిది.