
Damaged items : మనం వాస్తు శాస్త్రాన్ని నమ్ముతాం. ప్రతిది ఇంట్లో వాస్తు ప్రకారం ఉండాలని చూసుకుంటాం. ఇందులో భాగంగానే ఇంట్లో ఉన్న వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో తుప్పుపట్టిన పనిముట్లు, వస్తువులను తొలగించుకోవడం తప్పనిసరి. ఇవి ఇంట్లో ఉంచుకుంటే నెగెటివ్ ఎనర్జీ వస్తుంది. దీంతో మనకు ఆర్థిక ఇబ్బందులు, సమస్యలు రావడం సహజం.
సాధారణంగా ఇంట్లో గోడ గడియారాలు వాడతాం. అది పనిచేయకపోయినా అలాగే ఉంచుతాం. కానీ అలా ఉంచకూడదు. పాడైపోయిన గడియారాన్ని అయితే మరమ్మతు చేయించుకోవాలి. లేకపోతే దాన్ని బయట పడేయాలి. కానీ ఇంట్లో ఉంచుకుంటే అనర్థమే.
ఇంట్లో చెడిపోయిన వస్తువులు ఉంచుకుంటే ఇబ్బందులు వస్తాయి. ఇలాంటి వస్తువులు ఉంచుకుంటే కష్టాలు తప్పవు. ఈనేపథ్యంలో వాడని వస్తువులు బయట పడేయాలి. చెత్త సామాను ఉంటే వాటిని సాధ్యమైనంత వరకు ఇంట్లో ఉంచుకుంటే తిప్పలు తప్పవు.
ఇత్తడి పాత్రలు, పాడుబడిన వస్తువులు స్టోర్ రూంలో పెట్టుకోకూడదు. ఇంట్లో చెడిపోయిన, పాడయిన వస్తువులు ఉంచుకోవద్దు. ఒకవేళ ఉంచుకుంటే మనకు వాస్తు రీత్యా ఇబ్బందులు రావడం సహజం. అందుకే జాగ్రత్తగా ఉండాలి. పగిలిపోయిన, విరిగిపోయిన వస్తువులు ఎంత విలువైనవి అయినా బయట పడేయాలి. లేకపోతే మన ఇంటికి ప్రతికూలతలు రావడం కామన్.