
Mangoes : ఎండాకాలంలో మామిడి పండ్లు పుష్కలంగా దొరుకుతాయి. వీటిని తినడం వల్ల మంచి పోషకాలు దక్కుతాయి. దీంతో సీజనల్ గా దొరికే పండ్లు తినడం చాలా మంచిది. ఈ నేపథ్యంలో మామిడి పండ్లు చూడటానికి ఆకర్షణీయంగా ఉంటాయి. అందుకే వీటిని తినడం చాలా లాభం. ఇందులో ఉండే ప్రొటీన్ల వల్ల మ దేహానికి మేలు కలుగుతుంది. సహజమైన వాటిని రసాయనాలు కలిపి పండించిన వాటిని ఎలా గుర్తించడం ఎలా అనే దానిపై కొన్ని ట్రిక్కులు ఉన్నాయి.
మామిడి (mangoes) పండ్లు త్వరగా పండటానికి ఇథలీన్ ను కలుపుతారు. దీంతో అవి త్వరగా పక్వానికి వస్తాయి. దీంతో సహజమైన పండ్లకు రసాయనాలు వేసి పండించిన వాటికి తేడా ఉంటుంది. దీని వల్ల మనకు ఆరోగ్యం దెబ్బ తింటుంది. ప్రస్తుతం మార్కెట్లో ఎక్కువగా ఇలాంటి పండ్లు ఉంటున్నాయి. వీటితో చాలా కష్టాలు ఉంటాయి. వీటిని గుర్తించి తీసుకోవడం మంచిది.
సహజంగా పండిన పండ్లకు మచ్చలు ఉండవు. రసాయనాలు వేసి పండించిన వాటికి పసుపు, పచ్చ రంగులో మచ్చలు ఉంటాయి. రుచిలో కూడా తేడా ఉంటుంది. సహజంగా పండిన వాటి రుచి మధురంగా ఉంటుంది. రసాయనాలు వేసి పండించిన పండ్లలో కాస్త తియ్యదనం తక్కువగా ఉంటుంది. దీంతో మనం మార్కెట్లో కొనేటప్పుడే జాగ్రత్తలు తీసుకోవాలి.
పరిమాణంలో కూడా తేడాలు ఉంటాయి. సహజమైనవి పెద్దగా ఉంటాయి. రసాయనాలు వేసినవి చిన్నగా ఉంటాయి. ఈ తేడా గమనించుకోవాలి. ఇవి రసం కారుతున్నట్లు కనిపిస్తాయి. తెల్లగా లేదా నీలం రంగులో కనిపిస్తే వాటిని కొనుగోలు చేయొద్దు. నీళ్లలో వేస్తే సహజంగా పండినవి కిందికి మునుగుతాయి. రసాయనాలు వేసినవి పైకి తేలతాయి.