
The Gujarat Story : ‘ది కేరళ స్టోరీ’ అక్కడ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుంది. కేరళ ప్రభుత్వం ఇప్పిటికే అక్కడ సినిమా ప్రదర్శించకుండా ఆంక్షలు విధించగా ప్రతి పక్షాలు సైతం గగ్గోలు పెడుతున్నాయి. ముఖ్యమంత్రే ఈ సినిమాను కేరళలో విడుదల కానివ్వం అంటూ కామెంట్ చేశారంటే దాని ప్రభావం ఏ మేరకు ఉందో అర్థమవుతోంది. ‘ఈ సినిమాను కాంగ్రెస్ పార్టీకి ఎందుకు అడ్డుకుంటుంది..? ఆ పార్టీకి ఉగ్రవాదులకు ఉన్న లింకులేంటి..?’ అంటూ బీజేపీ తరుచూ ప్రశ్నిస్తుంది. కర్ణాటక ఎన్నికల్లో సైతం బీజేపీ నోరు జారింది.
బీజేపీ ‘ది కేరళ స్టోరీ’ని కాంగ్రెస్ పార్టీకి అంటగడుతుండడంతో కాంగ్రెస్ నాయకులు కూడా ధీటుగానే స్పందిస్తున్నారు. బీజేపీ కావాలనే తమకు ఉగ్రవాదులతో సంబంధం కలుపుతుందని మండిపడుతున్నారు. కేరళ స్టోరీ గురించి మాట్లాడే బీజేపీ ప్రధాని రాష్ర్టం గుజరాత్ మిస్సింగ్ లపై ఎందుకు స్పందించడం లేదని నిలదీస్తున్నారు.
ప్రస్తుతం ప్రధాని నరేందర్ మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా హయాంలోనే దాదాపు 40 వేల మందికి పైగా మహిళలు, యువతులు గుజరాత్ నుంచి కనిపించకుండా పోయారు. మరి వీరు లెక్కలు ఎక్కడా..? అంటూ కాంగ్రెస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. ఈ రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని జాతీయ నేర గణాంకాల శాఖ అంటున్నారు. 2016 నుంచి 2020 ఐదేళ్ల కాలంలోనే 41.621 మంది మిస్సయ్యారని గణాంకాలు చెప్తున్నాయని పేర్కొన్నారు.
మిస్సయిన చాలా మంది మానవ అక్రమ రవాణాగా విదేశాలకు తరలించబడ్డారని, ఇంకొందరు వ్యభిచార కూపంలోకి బలవంతంగా నెట్టి వేయ బడ్డారని వీరి గురించి ప్రధాని ఏం చెప్తారని కాంగ్రెస్ ఆ రాష్ర్ట అధికార ప్రతినిధి హిరేన్ బంకర్ ప్రశ్నించారు. మహిళల అక్రమ రవాణాను ఆ రాష్ర్ట బీజేపీ ప్రభుత్వం గతంలోనూ ఒప్పుకుందని బంకర్ అన్నారు.






