34.7 C
India
Monday, March 17, 2025
More

    Corrupt Country : అవినీతిలో రాజ్యమేలుతున్న దేశాల్లో భారత్ ప్లేస్ ఎంతంటే?

    Date:

    Corrupt
    Corrupt

    Corrupt Country : అత్యంత అవినీతి దేశాల జాబితాను ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ విడుదల చేసింది. ఇందులో ప్రపంచంలోని 180 దేశాలు పాల్గొన్నాయి. ఈ ఏడాది విడుదలైన నివేదిక ప్రకారం ప్రపంచంలోనే అత్యంత అవినీతి ఏ దేశం ఉంది.

    ప్రపంచవ్యాప్తంగా అవినీతి జరిగే దేశాలు కూడా ఉన్నాయి. అయితే ఇందులో ఎక్కువ, తక్కువ అవినీతి జరిగే దేశాలు ఉన్నాయి. 2024 సంవత్సరానికి Corruption Perceptions Index (CPI) ప్రకారం.. డెన్మార్క్ ప్రపంచంలోనే అతి తక్కువ అవినీతి దేశంగా నిలిచింది. తరువాత ఫిన్లాండ్, సింగపూర్, న్యూజిలాండ్ దేశాలు ఉన్నాయి. ట్రాన్స్పరెన్సీ ఇంటర్నేషనల్ నివేదిక భారతదేశాన్ని 96వ స్థానంలో నిలిపింది. గత సంవత్సరం ర్యాంక్ కంటే మూడు స్థానాలు వెనుకబడి ఉంది.

    నిపుణులు, వ్యాపారవేత్తల ప్రకారం.. ప్రభుత్వ రంగ అవినీతి స్థాయిలను బట్టి ఈ సూచిక 180 దేశాలు, భూభాగాలను ర్యాంక్ చేస్తుంది. జీరో నుండి 100 వరకు స్కేల్‌ను ఉపయోగిస్తుంది. ఇక్కడ “జీరో” అనేది అత్యంత అవినీతి, “100” ఉంటే ఎలాంటి అవినీతి లేదని అర్థం. 2024 నివేదిక ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలో అవినీతి ప్రమాదకరమైన సమస్య అని హైలైట్ చేసింది. కానీ చాలా దేశాలలో మంచి కోసం మార్పు జరుగుతోంది.

    కరెప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్‌లో ఇండియా కేవలం 39 పాయింట్లు మాత్రమే సాధించింది. దీంతో అవినీతి అవగాహన సూచికలో భారత్ 93వ స్థానంలో నిలిచింది. ఇంతకు ముందుకూడా భారత్‌ ఇదే స్థానాల్లో ఉంది. 2022కి, 2023కి ఇండియాలో అవినీతిలో పెద్దగా ఏమీ మారలేదని నివేదిక చెబుతోంది. 2023లో భారతదేశం ర్యాంక్ 93గా ఉంది. భారతదేశ పొరుగు దేశాలలో, పాకిస్తాన్ (135), శ్రీలంక (121) వాటి తక్కువ ర్యాంకింగ్‌లతో ఇబ్బంది పడుతుండగా, బంగ్లాదేశ్ 149 వద్ద మరింత వెనుకబడి ఉంది. ఈ ర్యాంకింగ్‌లో చైనా 76వ స్థానంలో ఉంది. అమెరికా, ఫ్రాన్స్ వంటి అగ్రరాజ్యాల నుంచి రష్యా, వెనిజులా వంటి నిరంకుశ దేశాల వరకు అనేక దేశాలు దశాబ్దానికి పైగా అత్యంత దారుణమైన ర్యాంకింగ్‌ను ఎదుర్కొన్నాయి.

    అమెరికా 69 పాయింట్ల నుండి 65కి పడిపోయి, గతంలో 24వ స్థానంలో నుంచి 28వ స్థానానికి చేరుకుంది. ఇతర పాశ్చాత్య దేశాలలో ఫ్రాన్స్ నాలుగు పాయింట్లు దిగజారి 67కి చేరుకోగా, జర్మనీ మూడు పాయింట్లు దిగజారి 75కి, మూడు స్థానాలు దిగజారిన కెనడాతో సమానంగా ఉంది.

    దేశ స్కోర్‌లను ఎలా లెక్కిస్తారు?

    అవినీతి అంటే లంచం ఇవ్వడమే కాదు. ఈ సూచికను రూపొందించేటప్పుడు చాలా విషయాలు అవినీతిలో భాగంగా పరిగణిస్తారు. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం, ప్రభుత్వ కార్యాలయాల వ్యక్తిగత వినియోగం, ప్రభుత్వ రంగంలో పెరుగుతున్న అవినీతి, ప్రభుత్వ రంగంలో అవినీతిని ప్రోత్సహించే నిబంధనలను అమలు చేయడం, సివిల్ సర్వీస్‌లో బంధువుల నియామకం, అవినీతి కేసుల నమోదు, అలాగే సంబంధిత వ్యక్తుల పై చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఇలా ఎన్నో రకాల విషయాలను పరిగణలోకి తీసుకుని జాబితాను తయారు చేసి విడుదల చేస్తారు.

    Share post:

    More like this
    Related

    Journalists Revathi : జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్ కు బెయిల్

    Journalists Revathi Bail : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు ఆయన...

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కేసులు

    betting : బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది సోషల్ మీడియా...

    Manipur : మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన.. మోడీ ట్రీట్ మెంట్ ఇట్లుంటదీ

    Manipur : మణిపూర్ ప్రస్తుతం రాష్ట్రపతి పాలనలో ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో,...

    Sunita and Wilmore : అంతరిక్షంలో ఉన్నందుకు సునీత, విల్మోర్ కు వచ్చే జీతభత్యాలు ఎంతంటే?

    Sunita and Wilmore : అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి ఎనిమిది రోజుల...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related