saipallavi హీరోయిన్ అంటేనే గ్లామర్ అంటారు.. ఏ హీరోయిన్ అయిన ఎక్స్పోజింగ్ చేస్తేనే ఆమెకు అవకాశాలు వస్తాయి అనే నానుడి ఇప్పుడు ఉంది. అందుకే హీరోయిన్ అంటే ఇప్పుడు నటన చూడడం లేదు.. హీరో పక్కన రెండు పాటలకు స్టెప్పులు వేస్తూ ఎక్స్పోజింగ్ చేస్తే చాలు అని అంటున్నారు. అందుకే హీరోయిన్స్ కూడా తమ అందాన్ని మరింత పెంచుకునేందుకు సర్జరీల బాట పడుతున్నారు.
నేచురల్ అందాన్ని పక్కన పెట్టి కొన్ని కొన్ని పార్ట్శ్ కు సర్జరీ అంటూ చేయించుకుని ఉన్న అందాన్ని మరింత పాడుచేస్తున్నారు. అయితే ఇలాంటి వాటికీ చాలా దూరంగా ఉండే భామల్లో సాయి పల్లవి ఒకరు. ఈ భామ ఎక్స్పోజింగ్ చేయదు.. కనీసం మేకప్ కూడా వేసుకోదు.. అంతేకాదు నటనకు ఆస్కారం లేని పాత్రను ఈమెను పక్కన పడేస్తుంది.
ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయిన కూడా ఈ అమ్మడు నటనకు ప్రాధాన్యం లేకపోతే నో చెప్పిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే ఈ భామ ఇప్పుడు సర్జరీ చేయించుకుంది అనే టాక్ నెట్టింట హాట్ టాపిక్ అవుతుంది. ఈ రోజు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న వార్త ఇది.. దీంతో ఆమె ఫ్యాన్స్ ఈ వార్త విషయంలో ఆందోళన పడుతున్నారు.
ఈమె ఒకానొక సందర్భంలో సర్జరీ చేయించుకోక తప్పలేదు అట.. ఆమె అందం కోసం అయితే సర్జరీ చేయించుకోలేదు.. డాన్స్ చేసున్న సమయంలో సాయి పల్లవి కాలుకి చిన్న గాయం అయ్యిందట.. దీంతో ఈమె సర్జరీ చేయించుకోవాల్సిన అవసరం పడిందట. ఇప్పటికి ఈమె డాన్స్ చేస్తే కాలు నొప్పి వస్తుందని టాక్.. అయితే ఇదే వార్త వేరే రకంగా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.