33.4 C
India
Wednesday, May 21, 2025
More

    Open Relationship : ‘ఓపెన్ రిలేషన్‌ షిప్’ అంటే ఏంటి..? ఇతర వ్యక్తులతో అఫైర్ పెట్టుకోవచ్చా..?

    Date:

    Open Relationship
    Open Relationship

    Open Relationship : సంప్రదాయమైన వివాహ వ్యవస్థ మారదు, కానీ రిలేషన్‌షిప్ మాత్రం మారుతూ ఉంటుంది. అది ట్రెండ్ కు తగ్గట్లుగా మారుతూ వస్తోంది. కొన్ని దేశాల్లో రిలేషన్ షిప్ పాపులర్ కల్చర్. కానీ, ఇప్పుడు ఇది అన్ని దేశాలకు పాకింది. అలాంటి వాటిలో ఓపెన్ రిలేషన్‌షిప్ ఒకటి. ఇందులో ఇద్దరు పార్ట్‌నర్స్‌ కలిసి ఉంటూనే ఇతరులతో ఎమోషనల్ లేదంటే సెక్సువల్ రిలేషన్‌షిప్ పెట్టుకోవచ్చు.

    ఇద్దరికీ అంగీకారం అయితేనే ఇది పాసిబుల్ అవుతుంది. సాధారణంగా జీవిత భాగస్వామి మధ్యలోకి మరొకరిని రానివ్వరు. రిలేషన్‌షిప్ లో ఉంటూనే మరో వ్యక్తితో అఫైర్ పెట్టుకుంటే దాన్ని మోసం కింద లెక్క కడతారు.

    ఓపెన్ రిలేషన్‌షిప్‌ ఎవరితోనైతే చేస్తారో, వారు ప్రైమరీ పార్ట్నర్ గా ఉంటారు. కావాలనుకుంటే ఈ ప్రైమరీ పార్ట్నర్ కాకుండా వేరొకరితో ఎమోషనల్‌గా, ఫిజికల్‌గా రిలేషన్ పెట్టుకోవచ్చు. ఈ రిలేషన్‌షిప్స్ కు అనేక రూపాలు ఉంటాయి. అయితే, ఇందులోకి దిగే ముందు ప్రజలు 5 బేసిక్, ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకోవాలి అవేంటంటే?

    ఎందుకు ఇలా?
    మిగతా సంబంధాల మాదిరిగానే ఓపెన్ రిలేషన్‌షిప్‌లోనూ సెక్యూర్, సేఫ్‌గా ఫీల్ అవ్వాలంటే ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ ముఖ్యం. అప్పుడే పరిమితులు లేకుండా ఇతరులతో చెట్టాపట్టాలు వేసుకొని తిరగవచ్చు. వారి ఇష్టాలను, అవసరాలను తీర్చుకోవచ్చు.

    అయితే, ఈ రిలేషన్ లో అసూయ, అభద్రత వంటివి అధిగమించేందుకు మ్యూచువల్ రెస్పెక్ట్, ఎమోషనల్ మెచ్యూరిటీ అవసరం అవుతుంది. ఓపెన్ రిలేషన్‌షిప్‌ కొంత మందికి సంతృప్తికరంగా ఉంటుంది. వారు ఒకే పార్ట్నర్ కే పరిమితం కావడం వల్ల తమ జీవనశైలి, వ్యక్తిగత అవసరాలు తీరవని అనుకుంటారు.

    నిజాయితీ
    పార్ట్నర్ సొంత ఆలోచనలు, కోరికలు, ఫీలింగ్స్ గురించి నిజాయితీగా ఉండాలి. ఏం చేస్తున్నారు.. ఎవరితో కలుస్తున్నారో వివరించాలి. పార్ట్నర్ ఫీలింగ్స్ ను గౌరవించి వారి అవసరాలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలి. అసూయ లేదంటే అభద్రతా భావాలు కలిగితే, వాటి గురించి మాట్లాడాలి. ఇద్దరికి సరిపోయే నియమాలు, పరిమితులను ఏర్పరచుకోవాలి.

    ఓపిక ముఖ్యం
    ఓపెన్ రిలేషన్‌ షిప్‌ పెట్టుకున్న ఇద్దరి మధ్య అనుబంధం వెంటనే బలపడదు. ఓపికతో ఇద్దరూ మార్పులకు సమయం ఇవ్వాలి. కమ్యూనికేషన్, నమ్మకం, గౌరవంతో బలమైన పునాది నిర్మించుకునేందుకు కృషి చేయాలి. అసూయ, అభద్రత, సంఘర్షణ వంటి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధం అవ్వాలి.

    శృంగారంలో జాగ్రత్తలు
    కొత్త వ్యక్తితో శారీరకంగా కలిసే ముందు జాగ్రత్తలు అవసరం. సురక్షితమైన లైంగిక పద్ధతులను ఫాలో కావాలి. గర్భనిరోధక మాత్రలు, పద్ధతులు పాటించాలి. పెద్ద నిర్ణయాలు తీసుకునే ముందు ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలి.

    మ్యూచువల్ బౌండరీస్
    ఓపెన్ రిలేషన్‌షిప్స్‌లో ఆశలు, లక్ష్యాలను స్పష్టంగా వివరించాలి. స్పష్టమైన పరిమితులు ఉండాలి. ఒకే అభిప్రాయంతో కలిగి ఉండాలి. ఒకరిపై సొంత నిర్ణయాలు రుద్దద్దు. ఒకరినొకరు గౌరవించుకోవాలి, శారీరక, భావోద్వేగ పరిమితులను గౌరవిస్తే సంతోషకరమైన జీవితం గడపవచ్చు.

    ఎప్పటికీ ద్రోహం చేయద్దు..
    ప్రతీ రిలేషన్‌షిప్ బలమైన నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. అది కోల్పోయినప్పుడు అది దెబ్బతింటుంది. ఓపెన్ రిలేషన్‌షిప్స్‌లో, అభద్రత, అసూయ ఫీలింగ్స్ పెరిగిపోతాయి. పరిస్థితి అంత వరకు రాకుండా చూడాలి.

    Share post:

    More like this
    Related

    Nara Lokesh : నారా లోకేశ్‌కు టీడీపీ ఫుల్ పవర్స్..!

    Nara Lokesh : తెలుగు దేశం పార్టీ (టీడీపీ)లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్న...

    NTR : ఎన్టీఆర్ జాతకం లో నిజంగానే రాజకీయ యోగం ఉందా..?

    NTR : జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేట్రంపై ఎన్నో ఊహాగానాలు, ఆసక్తికరమైన చర్చలు...

    War 2 Teaser : వార్ 2 టీజర్ రివ్యూ : ఎన్టీఆర్ ఇరగదీశాడుపో..

    War 2 Teaser : ఎన్టీఆర్ బర్త్‌డే సందర్భంగా విడుదలైన వార్...

    Train hijack : పాక్ కు మరో షాక్.. ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్

    Train hijack : పాకిస్థాన్‌లోని జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ను హైజాక్ చేసిన రెండు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related