
Pawan Son : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ప్రముఖ నటుడు పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్ ఆరోగ్యం మెరుగుపడుతోంది. ఇటీవల సింగపూర్‌లో జరిగిన స్కూల్ అగ్నిప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అతను, ఆస్పత్రిలో చికిత్స పొందిన తర్వాత డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం సింగపూర్‌లోని ఓ ఇంటిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా ధృవీకరించారు. సోషల్ మీడియా వేదికగా “మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి చేరుకున్నాడు. తను ఇంకా పూర్తిగా కోలుకోవాల్సి ఉంది. కానీ మా కులదైవం ఆంజనేయ స్వామి దయతో త్వరలో పూర్తి ఆరోగ్యంతో తిరిగి సాధారణ జీవితానికి వచ్చేస్తాడు,” అని తెలిపారు.