
Peoples Media : పీపుల్స్ మీడియా సంస్థ గురించి ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.. అందుకు కారణం లేకపోలేదు. తమిళ్ రీమేక్ వినోదయ సీతం స్టార్ట్ చేసినప్పుడు కూడా ఈ సంస్థ గురించి చర్చించు కున్నారు.. పవన్ కళ్యాణ్ నుండి అందరికి రెమ్యునరేషన్స్ భారీగా ఇచ్చి ఒక రీమేక్ సినిమాకు భారీ మొత్తం వెచ్చించి అంత బడ్జెట్ అవసరమా అసలు పెట్టిన బడ్జెట్ వస్తుందా అని అంతా అనుకున్నారు.
ఇక ఇప్పుడు ప్రభాస్ – మారుతి సినిమా పీపుల్స్ మీడియా దగ్గరకు రావడంతో ఇప్పుడు కూడా చర్చ స్టార్ట్ అయ్యింది. డివివి దానయ్య ఈ సినిమాను వదిలేయడంతో తిరిగి తిరిగి చివరకు పీపుల్స్ మీడియాకు చేరింది. ఈ సినిమాను ఏకంగా 45 కోట్ల సింగిల్ పేమెంట్ ఇచ్చి టేకోవర్ చేసుకుంది.. ప్రభాస్ ఉంటే ఫ్యాన్స్ చూస్తారు ఓకే.. కానీ మారుతితో ప్రభాస్ కాంబో వర్కౌట్ అవుతుందా అని అంతా అనుకుంటున్నారు..
కార్తికేయ 2, ధమాకా హిట్స్ చూసి మోసేసిన వారే రామబాణం ప్లాప్ చూసి ఈ సంస్థకు జాగ్రత్తలు చెప్పడం స్టార్ట్ చేసారు.. ఇలాంటి నేపథ్యంలో ఆదిపురుష్ రెండు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులను ఏకంగా 185 కోట్ల రూపాయలు చెల్లించి తీసుకోవడం ఇప్పుడు షాక్ ఇస్తుంది.. అంత పెట్టి తీసుకుంటే దగ్గర దగ్గరగా ఈ సినిమా 300 కోట్ల గ్రాస్ వసూళ్లు రావాల్సి ఉంటుంది.
తెలుగు రాష్ట్రాల్లో ఇంత డబ్బులు రావాలంటే మాములు విషయం కాదు అనే చెప్పాలి.. ఇంత పెట్టి హక్కులను చెల్లించుకుంటే ఈ రెండు రాష్ట్రాల్లో మార్కెట్ ఏ మేరకు చేస్తుందో చూడాలి.. నైజాం 70 కోట్లు, ఆంధ్ర 80 కోట్ల మార్కెట్ అన్న చేస్తేనే ఈ సంస్థ రికవరీ అయ్యే అవకాశం ఉంది. పీపుల్స్ మీడియాను నమ్మి డిస్టిబ్యూటర్స్ ఎవరు ముందుకు వస్తారో వేచి చూడాలి.. అయితే పీపుల్స్ మీడియా ఎందుకు ఇంత రిస్క్ చేస్తుంది? తెలిసి కూడా ఇలా అడుగులు ఎందుకు ముందుకు వేస్తుంది? వీటిపైనే టాలీవుడ్ తీవ్రంగా చర్చలు చేస్తుంది..






